ETV Bharat / state

కరోనా ఖైదీలు ఇలా పారిపోయారు.. - కరోనా రోగుల పరారీ వార్తలు

హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలోని ఖైదీల వార్డులో కొవిడ్‌ చికిత్స పొందుతున్న నలుగురు ఖైదీలు వేర్వేరు రోజుల్లో ఆసుపత్రికి వచ్చారు. నలుగురు కలిసి మాట్లాడుకుంటున్నారు. కాపలా ఉన్న పోలీసులు ప్రతి రెండు, మూడు గంటలకోమారు లోపలికి వెళ్లి పరిశీలిస్తున్నారు. వారు నిశితంగా చూడడం లేదని గమనించి.. పారిపోయారు.

Breaking News
author img

By

Published : Aug 28, 2020, 8:32 AM IST

హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్న నలుగురు ఖైదీలు గురువారం తెల్లవారుజామున పారిపోయారు. ఉదయం 6 గంటలకు తనిఖీలకు వెళ్లిన భద్రత సిబ్బందికి వీరు కనిపించలేదు. బాత్‌రూంలో కిటీకీ ఊచలు తొలగించి ఉన్నాయి. తప్పించుకున్నప్పటికీ బయటకు వెళ్లే అవకాశం లేదని ఆసుపత్రిలోనే గాలింపు చేపట్టామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.అంజనీకుమార్‌ తెలిపారు.

దుప్పటిని తాడులా పేనుకొని..

ఖైదీల వార్డులో కొవిడ్‌ చికిత్స పొందుతున్న జావేద్‌, మహ్మద్‌ అబ్దుల్‌, పి.నరసింహ, శ్యాంసుందర్‌లు వేర్వేరు రోజుల్లో ఆసుపత్రికి వచ్చారు. నలుగురు కలిసి మాట్లాడుకుంటున్నారు. కాపలా ఉన్న పోలీసులు ప్రతి రెండు, మూడు గంటలకోమారు లోపలికి వెళ్లి పరిశీలిస్తున్నారు. వారు నిశితంగా చూడడం లేదని గమనించిన జావేద్‌ పారిపోదామని ముగ్గురికి చెప్పాడు. బాత్‌రూంకు వెళ్లిన నలుగురు కిటికీ ఊచలను పరిశీలించారు. పదిరోజుల నుంచి రోజూ ఒకసారి గట్టిగా ఊపి వదులయ్యాక యథాస్థానంలో ఉంచేవారు. బుధవారం కిటికీ ఊచలన్నీ ఊడిపోయాయి. పారిపోయేందుకు దుప్పట్లను చించి తాడు పేనారు. అర్ధరాత్రి పోలీసులు వార్డుకు వచ్చి చూసివెళ్లారు. అనంతరం గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఒకరి తర్వాత ఒకరు బాత్‌రూంకు వెళ్లారు. కిటికీ నుంచి తాడును కిందికి వదిలి బయటకు వచ్చారు.

బయటకు పారిపోయారా.. లోపలే నక్కారా?

సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించామని, ఆటోల్లో లేదా నడుచుకుంటూ వెళ్లినట్టు ఆనవాళ్లు కనిపించడం లేదని చిలకలగూడ పోలీసులు అంటున్నారు. ఖైదీల వార్డుకు మూడు కారిడార్లు ఉండడం వల్ల రెండిటిని మూసి ఒకే ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఆసుపత్రి వెనుక ద్వారం గుండా పారిపోయేందుకు అవకాశాలున్నాయి. అక్కడి సీసీ కెమెరాలు పనిచేయడం లేదని సమాచారం.

ఉత్తరమండలం డీసీపీ కల్మేశ్వర్‌ శింగన్వార్‌, ఏసీపీ వెంకటరమణ, సీఐ బాలగంగిరెడ్డి ఆసుపత్రిలో విచారణ చేపట్టారు. ఖైదీల్లో ఒకరు మానసిక సమస్యతో ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందాడని, కరోనా రావడంతో గాంధీకి తరలించామని చర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌ సంపత్‌ తెలిపారు. తాండూరులో నేరం చేసిన కేసులో ఎం.జావీద్‌కు, రాజేంద్రనగర్‌లో నేరం చేసిన కేసులో మహ్మద్‌ అబ్దుల్‌కు శిక్ష పడింది. పి.నరసింహ, శ్యాంసుందర్‌ అండర్‌ ట్రయిల్‌ ఖైదీలు.

ఇదీ చదవండి: 'రామోజీ ఫిల్మ్‌సిటీలో వైభవంగా ఈటీవీ రజతోత్సవం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.