కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై నాలుగు కేసులను హైదరాబాద్‌లోని ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. నల్గొండ జిల్లా తిప్పర్తి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల్లో తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
అనుమతి లేకుండా ఆందోళనలు, కార్యక్రమాలు నిర్వహించారని కోమటిరెడ్డి, ఇతర నేతలపై గతంలో కేసులు నమోదు చేశారు. నల్గొండలోనే నమోదైన మరో కేసుపై రేపు తీర్పు వెలువడనుంది. ఈరోజు వేర్వేరు కేసుల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి, రాజాసింగ్, కంచర్ల భూపాల్ రెడ్డి, ప్రేమ్‌సింగ్ రాథోడ్ తదితరులు హాజరయ్యారు.