ETV Bharat / state

ఆత్మ విశ్వాసాన్ని పెంచే అమ్మ భాష తెలుగు, వెంకయ్య ట్వీట్ - national Telugu language

Venkaiah Naidu on Telugu language తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన భాషా సంస్కృతులే మన నిజమైన చిరునామా అంటూ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.

Venkaiah Naidu on Telugu language
Venkaiah Naidu on Telugu language
author img

By

Published : Aug 29, 2022, 12:25 PM IST

Venkaiah Naidu on Telugu language ''ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు... ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన భాషా సంస్కృతులే మన నిజమైన చిరునామా'' అని‌ భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. భవిష్యత్ తరాలకు మన భాషా సంస్కృతుల వైభవాన్ని అందించేందుకు తెలుగు వారంతా పునరంకితం కావాలని ఆకాంక్షించారు.

  • ఆత్మ విశ్వాసాన్ని పెంచే అమ్మ భాషను ప్రాథమిక విద్యలోనూ, పరిపాలనా భాషగా, న్యాయస్థానాల కార్యకలాపాల్లోనూ, సాంకేతిక విద్యలోనూ, కుటుంబ సభ్యులతో మాట్లాడే భాషగానూ వినియోగించడమే శ్రీ గిడుగు వారికి ఇచ్చే నిజమైన నివాళి. ఈ స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని ఆకాంక్షిస్తున్నా pic.twitter.com/rpYjyz6OsM

    — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) August 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

లండన్ పర్యటనలో ఉన్న ఆయన ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు భాషను ప్రజలపరం చేసి, వాడుక భాషా ఉద్యమం సాగించిన గిడుగు రాంమూర్తి పంతులు జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నానని చెప్పారు. గిడుగు చూపిన బాట ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని సూచించారు. అమ్మ భాష అందరి శ్వాస కావాలని పిలుపునిచ్చారు. ఎల్లలు దాటి తెలుగు వెలుగులు ప్రసరించాలని పేర్కొన్నారు.

ఆత్మ విశ్వాసం పెంచే అమ్మ భాషను ప్రాథమిక విద్యలో పరిపాలనా భాషగా, న్యాయ స్థానాల కార్యకలాపాలు, సాంకేతిక విద్యలోనూ, కుటుంబ సభ్యులతో మాట్లాడే భాషగా వినియోగించడమే గిడుగు వారికి ఇచ్చే నిజమైన నివాళి అని‌ స్పష్టం చేశారు. ఈ స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.

Venkaiah Naidu on sports day హాకీ లెజెండ్ ధ్యాన్‌ చంద్‌ జయంతి సందర్భంగా మనం జాతీయ స్పోర్ట్స్ డేను జరుపుకుంటున్నట్లు మరో ట్వీట్ చేశారు. హాకీ ఫీల్డ్‌లో అతని అద్బుతమైన విన్యాసాలు తర్వాతి తరాల క్రీడాకారులకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.