భాజాపా రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకమైన బండి సంజయ్‌కుమార్‌కు మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ అభినందనలు తెలిపారు. బండి సంజయ్ నాయకత్వంలో భాజపా మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు, పోరాటాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సఫలీకృతులై 2023లో భాజపా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంతకాలం తనకు సహకరించిన రాష్ట్ర ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ విమోచన యాత్ర, ఉద్యమాలు, ప్రజా పోరాటాలు విజయవంతం చేయడంలో సహకరించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇదీ చూడండి: భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్