ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను కల్వకుంట్ల రాష్ట్రంగా మారుస్తున్నారని మాజీ ఎంపీ వివేక్ ఆరోపించారు. హెచ్సీఏలో ఆయన కుటుంబ సభ్యులను దించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్లో తన నామినేషన్ను లోధా కమిటీ సిఫారుసులు అడ్డంపెట్టుకుని తిరస్కరించారని తెలిపారు. కోర్టులో కేసు నడుస్తుండగా ఇలా చేయండం సాధ్యంకాదని చెప్పారు. హైదరాబాద్ క్రికెట్ కోసం ఎన్నో చేశానని... కానీ ప్రస్తుతం నిధులు, స్పాన్సర్ షిప్ పోయిందని అన్నారు.
ఇదీ చూడండి: బతుకమ్మ సంబురాలకు సిద్ధమైన తెలంగాణ జాగృతి