ETV Bharat / state

కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: షబ్బీర్ అలీ - తెలంగాణ వార్తలు

కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సీఎం కేసీఆర్ తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారని విమర్శించారు. క్షేత్ర స్థాయి పరిస్థితులను న్యాయస్థానం బహిర్గతం చేసిందని గుర్తు చేశారు.

former minister shabbir ali fires on cm kcr, former minister shabbir ali
సీఎం కేసీఆర్​పై మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆగ్రహం, షబ్బీర్ అలీ
author img

By

Published : May 19, 2021, 9:42 AM IST

కొవిడ్‌ను నిలువరించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపించారు. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోడానికి తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను న్యాయస్థానం ఎత్తిచూపినప్పుడల్లా సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించి ఏదో ప్రకటన చేస్తుంటారని అన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం చెప్పే మాటలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉందని న్యాయస్థానం బహిర్గతం చేసిందన్నారు. ఆ వ్యాఖ్యల ప్రభావాన్ని తగ్గించుకోడానికి నకిలీ వాగ్దానాలతో సుదీర్ఘ ప్రకటన చేస్తారని ఆరోపించారు.

కరోనా కట్టడికి ముందస్తు చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని విమర్శించారు. వైద్య సౌకర్యాలు మెరుగు పరచకపోగా ఆక్సిజన్, పడకలు, మందులు, మానవ వనరులు, ఇతరత్ర ఏర్పాట్లు చేయలేదని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో కొరత రాకుండా 324 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో 48 ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్... అందుకు అవసరమైన నిధులను కేటాయించడంతోపాటు వాటి నిర్మాణానికి నిర్దేశిత గడువు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్‌ జిల్లోల్లో నూతన వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: అమ్మలా ఆదరిస్తున్నారు.. అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.