ETV Bharat / state

మాజీమంత్రి నాయిని అల్లుడు ఇంట్లో భారీగా నగదు, నగలు

Former minister nayini son in law's house huse cash and jewelry  seized
మాజీమంత్రి నాయిని అల్లుడు ఇంట్లో భారీగా నగదు, నగలు
author img

By

Published : Apr 10, 2021, 5:51 PM IST

Updated : Apr 10, 2021, 7:50 PM IST

17:49 April 10

మాజీమంత్రి నాయిని అల్లుడు ఇంట్లో భారీగా నగదు, నగలు

మాజీమంత్రి నాయిని అల్లుడు ఇంట్లో భారీగా నగదు, నగలు

ఈఎస్ఐ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా.. హైదరాబాద్‌లో జరిపిన ఈడీ సోదాల్లో భారీగా నగదు, నగలు వెలుగులోకి వచ్చాయి. గతంలో పెను వివాదాస్పదమైన ఈఎస్ఐ స్కాం కుంభకోణానికి సంబంధించి.. హైదరాబాద్ నగరంలో ఎన్​ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు ముమ్మరం చేసింది. ఇవాళ ఉదయం నుంచి నగరంలోని పదికి పైగా ప్రాంతాల్లో సోదాలు చేసిన ఈడీ.. బారీగా నగదు, కోటి రూపాయలకు పైగా విలువైన నగలు, బ్లాంక్ చెక్కులు, ఆస్తులకు సంబంధించిన దస్త్రాలను స్వాధీనం చేసుకుంది.  

మాజీ కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి, నాయిని మాజీ పీఎస్ ముకుంద రెడ్డి, నిందితురాలు దేవికారాణి ఇళ్లలో ఈ సోదాలు జరిగాయి. గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఇతర నిందితుల ఇళ్లలోనూ.. ఎన్​ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది.  

ఈ క్రమంలో నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డి, మాజీ సీఎస్ ముకుందరెడ్డి బంధువు వినయ్ రెడ్డి ఇళ్లలో భారీగా నగదు, నగలు దొరికాయి. ఏడు డొల్ల కంపెనీల నిర్వాహకుడు బుర్ర ప్రమోద్ రెడ్డి ఇంట్లోనూ నగలు, నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ డొల్ల కంపెనీల వెనుక రాజకీయ నేతల ప్రమేయం.. ఏమేరకు ఉందనే కోణంలో ఈడీ దర్యాప్తు జరుపుతోంది. కాగా మరో ఏడు ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి: ప్రభుత్వ ధరకే ప్రైవేటులో కొవిడ్ చికిత్స : మంత్రి ఈటల

Last Updated : Apr 10, 2021, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.