కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన జూబ్లీహిల్స్ అపోలో చికిత్స పొందుతూ చనిపోయారు.
1959 జులైన 1న పుట్టిన ఆయన... ఉస్మానియాలో బీఏ చదివారు. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థివిభాగం ఎన్ఎస్యూఐలో పనిచేశారు. అనంతరం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. జాంబాగ్ డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1989, 2004లో మహరాజ్‌గంజ్, 2009లో గోషామహల్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా, 2009 లో మార్కెటింగ్ శాఖ మంత్రిగా పని చేశారు. 2014, 2018లో గోషామహల్ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. 30 ఏళ్లుగా ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ముఖేష్‌గౌడ్‌కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.