హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చొరవ చూపడం శుభపరిణామమని పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు.
తెలుగు జాతిపై జస్టిస్ ఎన్వీ రమణకు ఉన్న ప్రేమకు, నిబద్ధతకు ఆయన చూపించిన చొరవే నిదర్శనమని మల్లు రవి అన్నారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు సఫలీకృతమైతే భారతదేశ చరిత్రలో ఆయన ఎప్పటికీ నిలిచిపోతుందని కొనియాడారు. రాష్ట్ర ప్రజల తరఫున జస్టిస్ ఎన్వీ రమణకు కృతజ్ఞతలు తెలిపారు. భౌగోళికంగా, వాతావరణ పరంగా సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటుకు హైదరాబాద్ అనుకూలంగా ఉంటుందని.. అందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: Rythu Bandhu: రెండో రోజు రూ.1152 కోట్లు జమ