వచ్చేనెలలో పోలింగ్ జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా జి.చిన్నారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు మరో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు వేశారు.
ఇప్పటివరకు మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 10 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. స్వతంత్ర అభ్యర్థులుగా మల్లుగుల్ల గుర్రప్ప, లక్కరాజు రవీందర్, సయ్యద్ ఫరీదుద్దీన్, కొమ్మి దినేశ్ చక్రవర్తి నామినేషన్ పత్రాలు సమర్పించారు.