ETV Bharat / state

Bandi sanjay on donations: 'ముందు దేశం.. తరువాతే కుటుంబం' - రామమందిరం మైక్రో విరాళాల సేకరణ

Bandi sanjay on micro donations: బ్లాక్ మెయిల్ చేసి అవినీతికి పాల్పడి నిధులు సేకరించాల్సిన అవసరం భాజపాకు లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సవాళ్లను అధిగమించడమే భాజపా కార్యకర్తల నైజమని తెలిపారు. జాతీయ స్థాయిలో మైక్రో డొనేషన్స్​పై జరిగిన వర్చువల్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రామ మందిర సూక్ష్మ విరాళాల సేకరణలో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపేందుకు కార్యకర్తలు తోడ్పాటునందించాలని సంజయ్ పిలుపునిచ్చారు.

BANDI SANJAY
BANDI SANJAY
author img

By

Published : Feb 7, 2022, 11:51 AM IST

Bandi sanjay on micro donations: ముందు దేశం, తరువాత పార్టీ, ఆ తరువాతే కుటుంబమని అదే భాజపా సిద్ధాంతామని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక ప్రతి ఒక్కరూ భారతీయుడునని, హిందువునని గర్వంగా చెప్పుకోగలుగుతున్నారని తెలిపారు. అనేక సవాళ్లను స్వీకరించి అధిగమించడమే భాజపా కార్యకర్తల నైజమని అన్నారు. రామ మందిర నిర్మాణ విరాళాల సేకరణలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని... అదే స్పూర్తితో సూక్ష్మ విరాళాల సేకరణ లోనూ అగ్రభాగాన నిలపాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

అందరి భాగస్వామ్యం ఉండాలి

భాజపా నాయకులతో బండి సంజయ్ మైక్రో డొనేషన్స్ పై వర్చువల్ సమావేశం నిర్వహించారు. మైక్రో డొనేషన్స్ జాతీయ ఇంఛార్జ్ సునీల్ దేవధర్, దక్షిణాది విభాగం ఇంఛార్జ్ నిర్మల్ సురానా, రాష్ట్ర ఇంఛార్జ్ చింతల రామచంద్రా రెడ్డి, సహ ఇంఛార్జ్​లు బండారు శాంతి కుమార్, పాపారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైక్రో డోనేషన్స్ ఆవశ్యకత, ఉద్దేశాలను బండి సంజయ్ వివరించారు. కొన్ని రాజకీయ పార్టీల మాదిరిగా బ్లాక్ మెయిల్ చేసి, అవినీతికి పాల్పడి నిధులు సమీకరించాల్సిన అవసరం భాజపాకు లేదన్నారు. పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు.

''రామ మందిరం నాది... ఇందులో నా భాగస్వామ్యం ఉంది అనే భావనను ప్రతి హిందువులో కలిగించాలి. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి విరాళాలు సేకరించాలి. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 25న చేపట్టిన విరాళాల సేకరణకు మరో 5 రోజులు మాత్రమే గడువు ఉంది. దీనిలోనూ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలపాలి. పార్టీ సభ్యత్వం కలిగిన కార్యకర్త ...పార్టీ కోసం చిన్న మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలి. వారి శక్తిని బట్టి రూ.5 నుంచి రూ.1000 వరకు ఇవ్వొచ్చు''.

- బండి సంజయ్ భాజపా అధ్యక్షుడు

ఇదీ చదవండి: Congress Digital Membership: 30 లక్షలకు చేరిన కాంగ్రెస్​ డిజిటల్​ సభ్వత్వాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.