తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మందుల కుంభకోణంలో అనిశా అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. చంచల్గూడ జైల్లో ఉన్న డైరెక్టర్ దేవికారాణి సహా ఏడుగురిని రెండు రోజులు కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు మొదటి రోజు విచారణలో నిందితులపై ప్రశ్నల వర్షం కురిపించారు. 2014 నుంచి ఇప్పటి వరకూ నాసి రకపు పరికరాలు కొనుగోలు చేసి వాటిపై కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును దారి మళ్ళించిన కేసులో దేవికా రాణిని ప్రశ్నించారు. తాజాగా సోదాల్లో అరవింద్ రెడ్డి కార్యాలయంలో దొరికిన డాక్యుమెంట్లపై ఏసీబీ దేవికా రాణిని సూటిగా ప్రశ్నించారు. ఏసీబీ సేకరించిన సాక్ష్యాలు మొత్తం నిందితుల ముందు పెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. వారు చెప్పిన స్టేట్మెంట్లను రికార్డు చేశారు. డైరెక్టరేట్లో ఉండాల్సిన కీలక పత్రాలు తన ఇంటికి ఎందు వచ్చాచయని... రూ.46 కోట్ల విలువైన ఒరిజినల్ పర్చేజ్ ఆర్డర్లు, ఇండెంట్లకు సంబంధించి పలు ప్రశ్నలు వేశారు. జాయింట్ డైరెక్టర్ పద్మ మెడికల్ క్యాంపుల పేరుతో లక్షల రూపాయలు ప్రవేటు వ్యక్తులకు కమిషన్ రూపంలో స్వాహా చేసిన దానపై కూడా ప్రశ్నలు సంధించారు. విచారణ అనంతరం తిరిగి చంచల్ గూడా జైలుకు తరలించారు. రేపు కూడా విచారణ చేపట్టనున్నారు.
ఇదీ చదవండిః ఈఎస్ఐ కుంభకోణంలో కదులుతున్న డొంక..