ETV Bharat / state

తిరుమల బూందీ పోటులో అగ్నిప్రమాదం

author img

By

Published : Dec 8, 2019, 3:03 PM IST

Updated : Dec 8, 2019, 3:28 PM IST

తిరుమల బూందీ పోటులో మంటలు చెలరేగాయి. బూందీ తయారుచేస్తుండగా.. గోడమీద పడిన నెయ్యి మరకలకు మంటలు వ్యాపించాయి. మూడు అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.

fire-accident-in-tirumala-bundi-tide
తిరుమల బూందీ పోటులో అగ్నిప్రమాదం

తిరుమల బూందీ పోటులో అగ్నిప్రమాదం జరిగింది. శ్రీవారి లడ్డూ తయారు చేసేందుకు బూందీని సిద్ధం చేస్తున్న సమయంలో పొయ్యి నుంచి మంటలు చెలరేగాయి. గోడకు ఉన్న నెయ్యి మరకలకు మంటలు అంటుకున్నాయి. పోటు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పింది.

అగ్నిమాపక సిబ్బంది మూడు అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఓ కార్మికునికి స్వల్ప గాయాలు కాగా.. బూందీ తయారీకి వినియోగించే ముడిసరుకు పాడయ్యింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అధికారులు విశ్లేషిస్తున్నారు.

తిరుమల బూందీ పోటులో అగ్నిప్రమాదం

ఇదీ చూడండి: దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం- 43 మంది దుర్మరణం

sample description
Last Updated : Dec 8, 2019, 3:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.