Fire in scrap warehouse kukatpally: కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లోని ఓ స్క్రాప్ గోదాములో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. స్క్రాప్ గోదాము నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు వ్యాపించకుండా ఏడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు.
అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు. ఘటనలో ఎవరికి ప్రాణహానీ జరగలేదు, అగ్ని ప్రమాదంలో 4 స్క్రాప్ గోదాములు, 2 ప్లాస్టిక్ బాటిల్స్ తయారీ షెడ్లు, అశోక్ లే ల్యాండ్ గూడ్స్ వాహనం, మారుతి 800 కారు ఈ ప్రమాదంలో అగ్నికి ఆహుతైనట్లు పోలీసులు సమచారం అందించారు.
"ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 5.30 సమయంలో స్క్రాప్ గోదాములో అగ్ని ప్రమాదం సంభవించినట్లు స్థానికులు సమాచారం అందించారు. వెంటనే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఏడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేశాము. ఈ అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణహానీ జరగలేదు. మంటలను అదుపు చేయడానికి డీఆర్ఎఫ్ సిబ్బంది వారు సైతం సహకరించారు". - సుధాకర్ జిల్లా ఫైర్ ఆఫీసర్, మేడ్చల్ జిల్లా
నివారణా చర్యలు: వేసవి వస్తూనే అగ్నిప్రమాదాలతో హడలెత్తిస్తుంటుంది. కొన్నిసార్లు ఆస్తి, ప్రాణ నష్టం భారీగా ఉంటుంది. చాలా వరకు అగ్నిప్రమాదాలకు షార్ట్ సర్క్యూటే కారణమని చెబుతున్నారు. దుకాణాలు, గోడౌన్లతోపాటూ ఇటీవల అపార్ట్‌మెంట్లలోనూ ప్రమాదాలు పెరిగాయి. ఈ ప్రమాదాలకు గల కారణాలు, అవి సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అగ్నిప్రమాదాలు ఎక్కువగా మూసి ఉన్న దుకాణాలు, గౌడౌన్లలో జరుగుతున్నాయి.
ఇదివరకు మూసేసే సమయంలో విద్యుత్తు సరఫరాను పూర్తిగా నిలిపేసేవారు. ప్రస్తుతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల విద్యుత్తును ఆపడం లేదు. వదులు తీగలతో ఎక్కడైనా స్పార్క్ ఏర్పడితే మంటలు త్వరగా వ్యాపించే గుణమున్న వస్తువులతో మొత్తం తగలబడుతున్నాయి. షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఉండాలంటే నాణ్యమైన ఐఎస్‌ఐ మార్క్ కలిగిన విద్యుత్ ఉపకరణాలనే వాడాలి.
ఇవీ చదవండి: