ఇరాక్‌లోని ఓ కొవిడ్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 50 మంది రోగులు చనిపోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇరాక్‌లోని నసీరియా పట్టణంలోని అల్-హుస్సేన్ కొవిడ్ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. ఆసుపత్రి ప్రాంగణంలోని ఆక్సిజన్ ట్యాంక్ పేలడంతో మంటలు వ్యాపించినట్లు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి.
సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు బృందాలు ఘటన స్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి. ఆసుపత్రిలో మంటలతో పాటు దట్టమైన పొగలు ఆవరించాయి. దీంతో కొవిడ్ వార్డుల్లో చిక్కుకున్న రోగులను వెలుపలికి తీసుకొచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆరోగ్య సిబ్బంది తెలిపారు.
గత ఏప్రిల్‌లో కూడా ఓ కొవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ పేలి 82 మంది రోగులు చనిపోగా, 110 మంది గాయపడ్డారు. ఇరాక్ ఇప్పటివరకు 14 లక్షల కొవిడ్ కేసులు నమోదు కాగా, 17,000పైగా చనిపోయారు.
ఇదీ చదవండి: భార్యను కత్తితో పొడిచి.. రెండేళ్ల కుమారుడిని గొంతు కోసి చంపిన వ్యక్తి