ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా అరండల్ పేట ఏటీఎంలో అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఏటీఎం గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు.
అప్పటికే ఏటీఎం మిషన్ పూర్తిగా కాలిపోయింది. పక్కనే ఉన్న భవనానికి సైతం మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
ఏటీఎంలో నగదు ఏమైనా ఉందా..? ఎంత ఉంది..? అనే విషయమై బ్యాంకు అధికారుల నుంచి పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: కరోనా రికార్డ్: కొత్తగా 16,922 కేసులు, 418 మరణాలు