సికింద్రాబాద్ ఆర్పీరోడ్లోని కరాచీ బేకరీ పక్కన ఉన్న విద్యుత్ స్తంభంపై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విద్యుత్ స్తంభంపై షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల పక్కనే ఉన్న ఫ్లైవుడ్ చెక్కలకు సంబంధించిన దుకాణంలో మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించటం వల్ల స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
పోలీసులకు సమాచారం అందించగా... హుటాహుటిన ఘటానాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ జరిగిన ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ప్రమాద సమయంలో జనసంచారం లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.