ETV Bharat / state

ఇంట్లో తెగిపడ్డ విద్యుత్ తీగలు..దగ్ధమైన కారు

హైదరాబాద్​ మలక్​పేటలోని అక్బర్​బాగ్​ వద్ద ఓ ఇంట్లో విద్యుత్​ వైర్లు తెగి పడి... అగ్నిప్రమాదం జరిగింది. అక్కడే ఉన్న కారులో మంటలు చెలరేగగా అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలకు అదుపులోకి తీసుకొచ్చారు.

author img

By

Published : May 17, 2020, 2:24 PM IST

fire accident at malakpet due to current wires
విద్యుత్​ తీగలు తెగాయి.. మంటలు చెలరేగాయి

హైదరాబాద్​ మలక్​పేటలోని అక్బర్​బాగ్​ వద్దనున్న దయానంద్​ నగర్​లోని ఓ ఇంట్లో విద్యుత్​ తీగలు తెగిపడ్డాయి. ఇంటి వద్ద పార్క్ చేసి ఉన్న కారుకి తగిలి... పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇంట్లో నివసిస్తున్న వృద్ధురాలిని పక్కింట్లోకి ఎత్తుకుని తీసుకెళ్లారు.

పెద్ద ఎత్తున పొగ కమ్మకోవడం వల్ల భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడం వల్ల పెను ప్రమాదం తప్పింది.

ఇదీ చదవండిః డ్రైవర్​ లేని బస్సు..అలా దూసుకెళ్లింది..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.