ETV Bharat / state

గుడిమల్కాపూర్ అంకుర​ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం - పేషెంట్లు సురక్షితం - Ankura Hospital fire accident

Fire Accident at Gudimalkapur in Hyderabad : హైదరాబాద్​లోని మెహిదీపట్నం పరిధిలోని గుడిమల్కాపూర్​లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అంకుర ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆసుపత్రి నిర్వహిస్తున్న ఐదు అంతస్తుల భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. నాలుగు ఫైరింజన్లతో ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.

Fire Accident at Hyderabad
Fire Accident at Gudimalkapur in Hyderabad
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 23, 2023, 6:41 PM IST

Updated : Dec 23, 2023, 9:32 PM IST

Fire Accident at Gudimalkapur in Hyderabad : హైదరాబాద్ గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకుర ఆసుపత్రి(Ankura Hospital)లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు, ఆసుపత్రి సిబ్బంది సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని నాలుగు ఫైరింజన్​లతో మంటలను ఆర్పేశారు. అనంతరం అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మరోవైపు ప్రమాదంపై ఆసుపత్రి యాజమాన్యం వివరణ ఇచ్చింది.

గుడిమల్కాపూర్ అంకుర​ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం - పేషెంట్లు సురక్షితం!

మంటలను గమనించిన ఆసుపత్రి సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కొంతమంది పేషంట్లను బయటకు పంపించేశారు. ఘటనాస్థలానికి చేరుకొని సౌత్​జోన్​ డీసీపీ సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం(Fire Accident)లో ఇప్పటివరకు ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఆసుపత్రిపైన ఉన్న బోర్డు, ఆసుపత్రికి ఉన్న ఫ్లెక్సీలు షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయి మంటలకు కారణమై ఉండవచ్చని పోలీసులు అంచనా వేశారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఈ ఘటనతో స్థానికంగా ఉండే ప్రజానీకం భయాందోళనలకు గురయ్యారు.

విచారణకు ఆదేశం : అంకుర ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి, డీహెచ్​లు విచారించాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశాలు జారీ చేశారు.

కార్ల షోరూంలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడిన మంటలు

ఆసుపత్రి యాజమాన్యం వివరణ : అగ్ని ప్రమాద ఘటనపై అంకుర ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది. ఆసుపత్రి భవనంలోని తొమ్మిదో అంతస్తులో ప్రమాదం సంభవించిందని స్పష్టం చేసింది. షార్ట్​సర్క్యూట్​ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పారు. ఫైర్​ సిబ్బంది మంటలను అదుపు చేశారని, అగ్ని ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. రోగులు, సిబ్బంది రక్షణకు అన్ని చర్యలు చేపట్టామని ఆసుపత్రి యాజమాన్యం వివరణ ఇచ్చింది.

అగ్నికి ఆహుతైన నర్సుల సర్టిఫికేట్లు : ఈ అగ్నిప్రమాదంలో సర్టిఫికెట్లు కాలిపోయాయని కొందరు నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలోని ఐదో అంతస్తులో హాస్టల్​ ఉందని, అందులో తాము ఉంటున్నామని చెప్పారు. వేగంగా మంటలు రావడంతో సర్టిఫికెట్లు అక్కడే వదిలేసి వచ్చేశామని నర్సులు రోదిస్తున్నారు. ఆసుపత్రిలో ఎంతమంది ఉన్నారో తెలియడం లేదు.

Fire Accident At Hyderabad : హైదరాబాద్​లో మరో అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు

తెలంగాణ పర్యాటక భవన్​లో భారీ అగ్ని ప్రమాదం - అగ్నికి ఆహుతైన కీలక దస్త్రాలు, కావాలనే!

Last Updated : Dec 23, 2023, 9:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.