ప్రజల అండదండలతో సమస్యలు, సవాళ్లు, ప్రతికూలతలు చాకచక్యంగా దాటుకుని అభివృద్ధిలో రాష్ట్రం కొంతపుంతలు తొక్కిందని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. శాసనసభలో 2021-22కు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి.. కరోనా రూపంలో ఊహించని విపత్తు విరుచుకుపడినా.. ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. శతాబ్దకాలంలో కనీవినీ ఎరగని రీతిలో ఆర్థిక విపత్తు వాటిల్లిందన్నారు.
లాక్‌డౌన్‌తో ప్రపంచమంతా స్తంభించిపోయిందన్న హరీశ్‌రావు.. కేంద్ర, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. జీడీపీ దారుణంగా పతనమైందని.. మైనస్ 8శాతానికి పడిపోయిందని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ వల్ల ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటున్నాయని తెలిపారు.
తెలంగాణలో ప్రస్తుతం జీఎస్డీపీ ప్లస్1 గా నమోదైందన్నారు. వృద్ధిరేటు బాగుంటుందని ఆశిస్తూ 2 లక్షల 30 వేల 825.96 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. కరోనాను తట్టుకుని నిలిచిన ఏకైక వ్యవసాయ రంగాన్ని అన్ని రకాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 2 లక్షల కోట్లను దాటిన తెలంగాణ వార్షిక బడ్జెట్