ETV Bharat / state

HARISH RAO: నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా హరీశ్‌రావు

నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి హరీశ్ రావు (HARISH RAO) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ ప్రగతి పథంలో నడిచేలా కృషి చేస్తానని చెప్పారు. సీఎం కేసీఆర్(CM KCR) సహకారంతో నుమాయిష్‌ను విశ్వవ్యాప్తం చేద్దామని అన్నారు.

HARISH RAO as nampally exhibition society president, harish rao latest news
నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఛైర్మన్‌గా హరీశ్ రావు, మంత్రి హరీశ్ రావు
author img

By

Published : Aug 21, 2021, 3:35 PM IST

హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు(HARISH RAO) ఎన్నికయ్యారు. ఈమేరకు ఎన్నికైనట్లు ఎగ్జిబిషన్ సోసైటీ యాజమాన్య కమిటీ ప్రకటించింది. ఎగ్జిబిషన్‌ సోసైటీ అధ్యక్షుడిగా అంగీకరించినందుకు హరీశ్‌రావుకు కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ ప్రగతి పథంలో నడిచేలా కృషి చేస్తానన్న మంత్రి హరీశ్‌రావు... 80 ఏళ్లుగా ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న సొసైటీని అందరం కలిసి ముందుకు తీసుకెళ్దామని తెలిపారు.

తన బాధ్యత మరింత పెరిగిందన్న హరీశ్ రావు... ప్రతిష్ఠాత్మక సంస్థను అందరమూ కలిసి ముందుకు తీసుకెళ్దామని కోరారు. సీఎం కేసీఆర్(CM KCR) సహకారంతో నుమాయిష్‌ను విశ్వవ్యాప్తం చేద్దామని హరీశ్‌రావు వెల్లడించారు. సొసైటీ విద్యాసంస్థల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, వృత్తి నైపుణ్యం మెరుగుపడి ఉపాధి అవకాశాలు పొందేలా చేద్దామని హరీశ్‌రావు వివరించారు.

'సొసైటీ ప్రగతి పథంలో నడిచేలా కృషిచేస్తాను. సొసైటీని అందరం కలిసి ముందుకు తీసుకెళ్దాం. 80 ఏళ్లుగా ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తుంది. సీఎం సహకారంతో నుమాయిష్‌ను విశ్వవ్యాప్తం చేద్దాం. సొసైటీ విద్యాసంస్థల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తోంది. వృత్తి నైపుణ్యం మెరుగుపడి ఉపాధి అవకాశాలు పొందేలా చేద్దాం.'

-హరీశ్ రావు, ఆర్థికశాఖ మంత్రి

తెరాసకు రాజీనామా చేసిన అనంతరం నాంపల్లి ఎగ్జిబిషన్​ సొసైటీ ప్రెసిడెంట్ పదవికి ఈటల రాజేందర్(etela rajender) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సొసైటీ కార్యదర్శికి పంపారు. 2014 నుంచి ఈ ఏడాది జూన్​ 15 వరకు ఎగ్జిబిషన్​ సొసైటీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్​ పని చేశారు.

ఇదీ చదవండి: Congress: హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కొండా సురేఖ దాదాపు ఖరారు!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.