సచివాలయ కార్యాలయాల తరలింపు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. బూర్గుల రామకృష్ణారావు భవన్‌కు దస్త్రాలు తరలిస్తున్నారు. మొదటి అంతస్తులో ఉన్న మార్కెటింగ్ శాఖ కార్యాలయం ఎల్బీ నగర్‌కు తరలించాలని నిర్ణయించారు. దాదాపుగా శాఖలన్నీ కూడా సచివాలయ సమీపంలోని బూర్గుల రామకృష్ణారావు భవన్ లోకి తరలించడమే మేలని అధికారులు ఇప్పటికే నిర్ణయించారు. కేవలం రెండు, మూడు శాఖలు మాత్రమే శాఖాధిపతుల కార్యాలయాలకు తరలనున్నాయి. అటవీశాఖ కార్యాలయం అరణ్యభవన్‌కు, రహదారులు- భవనాల శాఖ ఎర్రమంజిల్ లోని ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయానికి వెళ్లనుంది. ఇక మిగతా శాఖలన్నింటినీ బీఆర్కే భవన్ కు తీసుకెళ్లాలని... నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. బీఆర్కేభవన్లో అన్ని శాఖలు సర్దుబాటు కాకపోతే పక్కనే ఉన్న ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వినియోగించుకోవాలని భావిస్తున్నారు.
ఇదీ చదవండిః నోటిఫికేషన్ రాకముందే రాజకీయ వేడి