ETV Bharat / state

విద్యలో క్వాలిటీ పెంచేందుకు విద్యాసంస్థలు పాటుపడాలి: ఫిక్కీ

కరోనా కారణంగా అంధకారంగా మారిన అకడమిక్స్ భవిష్యత్తును.. అందివస్తోన్న టెక్నాలజీతో అధిగమించాలని, అదేవిధంగా విద్యలో క్వాలిటీ పెంచేందుకు విద్యాసంస్థలు పాటుపడాలని వెబినార్ సూచించింది. టాప్ ఐటీ కంపెనీలు, గ్లోబల్ సంస్థలకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్​ను.. గ్లోబల్ స్టూడెంట్స్ ఉన్నతవిద్య కోసం ఓ డెస్టినేషన్గా ఎంచుకోవాలని.. ఆ దిశలో యూనివర్శిటీలు పురోగతి సాధించాలని వెబినార్​లో పాల్గొన్న ప్రముఖులు ఆకాంక్షించారు. ఇన్నోవేటివ్ మోడల్స్​తో యూనివర్శిటీలు ముందుకు రావాలని.. పరిశోధన, టెక్నాలజీకి అధిక ప్రాధాన్యమివ్వాలని ఫిక్కీ సూచించింది.

ficci
విద్యలో క్వాలిటీ పెంచేందుకు విద్యాసంస్థలు పాటుపడాలి: ఫిక్కీ
author img

By

Published : Sep 19, 2020, 8:07 PM IST

విద్యలో ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతున్నాయని.. ప్రైవేటు యూనివర్శిటీలు ఏర్పాటవుతున్నాయని.. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. రూసా ప్రాజెక్టు కింద వందకోట్ల పెట్టుబడులతో ఉస్మానియా యూనివర్శిటీలో గ్లోబల్ ఇన్నోవేషన్లు వచ్చాయని నవీన్ తెలిపారు. యూనివర్శిటీలలో స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులు పెంచాలని.. ఫ్యాకల్టీలో పరిశోధనకు థ్రష్ట్ పెరిగితే.. వారిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు పరిశోధకులుగా మారతారని అన్నారు. సిస్టంలో, బ్రాంచెస్​లో ఫ్లెక్సీబిలిటీ తీసుకురావాలని.. కాన్సెప్ట్ లర్నింగ్ పెరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. జనరల్ డిగ్రీ కోర్సు నుంచి స్పెషలైజ్డ్ కోర్సులు, బ్రాంచిలలో రిజిడ్ అప్రోచ్ వదిలి.. ఇష్టమైన సబ్జెక్టు సమాంతరంగా చదివేలా సిస్టంలో ఫ్లెక్సిబిలిటీ రావాలని.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుకు అంకురార్పన చేసిందని నవీన్ తెలిపారు.

హైయర్ ఎడ్యుకేషన్​కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయింపులు పెరగాలని నిపుణులు సూచించారు. ఇన్నోవేషన్​కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని... తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఐటీ, టెక్నాలజీ మేజర్ పార్టనర్​గా ఉన్నాయని పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్​ రంజన్ అన్నారు. గ్రామీణ ప్రాంత యువతకు టెక్నాలజీ సపోర్ట్ చేసే ఎలైట్ విద్యాసంస్థలను టైర్ టూ సిటీస్ కి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతోందని తెలిపారు. ఇన్నోవేషన్​కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇతోధిక ప్రాధాన్యమిస్తోందని.. గ్రామీణ యువతకు టెక్నాలజీ సపోర్ట్ చేస్తోందని పేర్కొన్నారు. పరిశ్రమకు సిద్ధం చేసేలా కళాశాలలు, యూనివర్శిటీలలో అకడమిక్స్ ఉండాలని.. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే లోపే యువత ఇండస్ట్రీ రెడీగా ఉంటే టాస్క్ వంటి స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాంలకు అటెండ్ అవ్వటం, పరిశ్రమలు.. ట్రైనింగ్ కోసం సమయం, మనీ వృథా చేయటం జరగదని జయేష్ అభిప్రాయప్డడారు.

యూనివర్శిటీ, కాలేజీలలో పరిశోధన పెరగాలని.. రీసెర్చ్ ఫండింగ్ పెంచాలని.. నిట్ వరంగల్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు కోరారు. నూతన విద్యావిధానం ద్వారా ఈ సంస్కరణలకు ఫిక్కీ ఐడియేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ కొరకు.. ఫిక్కీ సహకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్లవేలలా ఉంటుందని డాక్టర్ సంగీతా రెడ్డి అన్నారు.

ఇదీ చదవండి: 'గ్రామీణ భారతానికి ఈ బడ్జెట్ ఊతమిస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.