ETV Bharat / state

'నయీమ్​ ఎన్​కౌంటర్​ కేసును సీబీఐచే విచారణ జరిపించాలి' - Padmanabha reddy on sit in nayeem case

నయీమ్​కు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొన్న 25 మంది పోలీస్​ అధికారులకు సిట్​ క్లీన్​ చిట్​ ఇవ్వడం పట్ల సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నయీమ్​ ఎన్​కౌంటర్ తర్వాత 173 నేరాభియోగ పత్రాలు న్యాయస్థానంలో దాఖలు చేసినా.. ఏ ఒక్క కేసులో ఇప్పటి వరకు దర్యాప్తు పూర్తి కాలేదని ఆరోపించారు. ఈ కేసును సీబీఐచే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్​ చేశారు.

Fgg wrote a letter to governor on nayeem case
'నయీమ్​ ఎన్​కౌంటర్​ కేసును సీబీఐచే విచారణ జరిపించాలి'
author img

By

Published : Oct 3, 2020, 7:36 PM IST

గ్యాంగ్​స్టర్ నయీమ్​తో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొన్న పోలీస్​ అధికారులకు ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్ చిట్​ ఇచ్చింది. నయీమ్​ నేర సామ్రాజ్యానికి సహకరించారని 25 మంది పోలీస్ అధికారులపై ఆరోపణలు రాగా.. ఇందుకు సంబంధించి సరైన ఆధారాలు లేవని సిట్ పేర్కొంది. 25 మంది అధికారులపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఎలాంటి చర్యలకు సిఫార్సు చేయలేదు. సిట్​కు సుపరిపాలన వేదిక రాసిన లేఖకు ఇచ్చిన సమాధానంలో ఈ విషయం బయటపడింది.

నయీమ్​ ఎన్​కౌంటర్ తర్వాత మొత్తం 240 కేసులు నమోదు చేశారని.. ఇప్పటి వరకు 173 నేరాభియోగ పత్రాలు న్యాయస్థానంలో దాఖలు చేసినా.. ఏ ఒక్క కేసులో ఇప్పటి వరకు దర్యాప్తు పూర్తి కాలేదని సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి తెలిపారు. నయీమ్​ ఇంట్లో దొరికిన డబ్బు విషయంలో అనుమానాలు తలెత్తుతున్నాయని అన్నారు. నయీమ్​ డైరీ గురించి బయటికి చెప్పకపోవడం.. దర్యాప్తుపై సందేహాలు లేవనెత్తుతోందని పద్మనాభరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు నయీమ్​ ఎన్​కౌంటర్ కేసును సీబీఐచే విచారణ జరిపించాలని గవర్నర్​కు రాసిన లేఖలో సుపరిపాలన వేదిక డిమాండ్ చేసింది.

'నయీమ్​ ఎన్​కౌంటర్​ కేసును సీబీఐచే విచారణ జరిపించాలి'

ఇదీ చూడండి: ప్రత్యేక దర్యాప్తు బృందం పనితీరు సరిగా లేదు: పద్మనాభరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.