ETV Bharat / state

రాష్ట్ర అటవీ కళాశాలకు ఏ ప్లస్​ ఇచ్చిన కేంద్రం

అటవి విద్య బోధన, పరిశోధనలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధన సంస్థ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ ప్లస్ కేటగిరీ విద్యా సంస్థగా గుర్తింపు పొందింది. అటవీ కళాశాలలు, ప్రమాణాలు, వసతులను అధ్యయనం చేసిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ రాష్ట్ర అటవీ కళాశాలకు అత్యంత ప్రాధాన్యతా గుర్తింపును ఇచ్చింది.

author img

By

Published : Jun 18, 2020, 8:19 PM IST

fcri recognition to telangana forest college from central government
రాష్ట్ర అటవీ కళాశాలకు ఏ ప్లస్​ ఇచ్చిన కేంద్రం

అడవులు, పర్యావరణ రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అటవీ విద్యను ప్రోత్సహించాలన్న సంకల్పంతో తమిళనాడు మెట్టుపలాయం అటవీ కళాశాలకు దీటుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఆదేశాలతో 2015లో ఆటవీ కళాశాల ప్రారంభమైంది. 2016లో బీఎస్సీ ఫారెస్ట్రీ మొదటి బ్యాచ్ నాలుగేళ్ల కోర్సుతో ప్రారంభమైంది. ఈ యేడాదే ఫైనల్ ఇయర్ విద్యార్థులు తమ కోర్సు పూర్తి చేసుకుంటున్నారు. ముందుగా దూలపల్లి ఫారెస్ట్ అకాడెమీలో మొదలైన కళాశాల, గత డిసెంబర్ లో హైదరాబాద్ శివారు ములుగులో సొంత క్యాంపస్​లోకి మారింది.

విజయవంతంగా మొదటి బ్యాచ్ బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సును పూర్తి చేసుకుంటున్న అటవీ కళాశాల ఈ ఏడాది నుంచి రెండేళ్ల ఎంఎస్సీ ఫారెస్ట్రీతో పాటు, మూడేళ్ల పీహెచ్ డీ ఫారెస్ట్రీ కోర్సులను కూడా ప్రారంభిస్తోంది. తొలి నాళ్లలో ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా బీఎస్సీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగింది. ఎంసెట్ కౌన్సిలింగ్ ఆధారంగా ప్రస్తుతం ప్రవేశాలు జరుగుతున్నాయి. బోధనలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ బ్రిటిష్ కొలంబియా, అబర్న్ యూనివర్సిటీలతో అవగాహనా ఒప్పందాలను కళాశాల కుదుర్చుకుంది.

ఇటీవలే ఓ విద్యార్థినికి అబర్న్ యూనివర్సిటీ ఉచితంగా ఎంఎస్సీ సీటును ఆఫర్ చేసింది. తాజాగా ఏప్లస్ గుర్తింపు సాధించినందున తెలంగాణ ఆటవీకళాశాలకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు మరింతగా వచ్చే అవకాశముంది. ప్రభుత్వం, ఇతర సంస్థల సహకారంతో అటవీకళాశాల విద్య, పరిశోధనా రంగాల్లో అభివృద్ధికి ఆస్కారం ఏర్పడుతుంది.

ఇదీ చదవండి: 940 కేజీల గంజాయి పట్టివేత

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.