ETV Bharat / state

Father killed his daughter at Chandanagar : భార్యపై కోపం.. సొంత కుమార్తెను బ్లేడ్​తో కోసి హత్య చేసిన తండ్రి - Disputes between husband and wife

Father killed his daughter at Chandanagar : మానవత్వం మంటగలిసిపోతుంది. కన్నపేగును సైతం కాలరాస్తోంది. భార్యకు ఆనందాన్ని దూరం చేద్దామని కుట్ర పన్నిన ఓ భర్త .. అభం శుభం తెలియని కన్న కుమార్తెనే కడ తేర్చాడు. శవాన్ని మాయం చేసే క్రమంలో అనూహ్యంగా ప్రమాదానికి కారణమై.. పోలీసులకు దొరికిపోయాడు. విచారణలో తానే చిన్నారిని హత్య చేశానని ఒప్పుకుని కటకటాలపాలయ్యాడు.

father killed his daughter at Chandanagar

author img

By

Published : Aug 19, 2023, 7:14 PM IST

Updated : Aug 19, 2023, 9:19 PM IST

Mokshaja murder case at Chandanagar : భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదాలు.. సొంత కుమార్తెను హత్య చేసే వరకు తీసుకొచ్చాయి. భార్యపై కోపంతో తన సొంత కుమార్తెను గొంతు కోసి చంపాడు ఓ తండ్రి.. అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు పెద్ద వ్యూహమే రచించాడు. అందుకు ఆయన కారును ఎంచుకున్నాడు. చిన్నారి మృతదేహాన్ని వెనుక సీటులో పెట్టుకొని తాను డ్రైవింగ్​ చేస్తూ వెళ్తున్నాడు. ఇంతలో కారు ప్రమాదానికి గురి కాగా.. ఆయన అసలు బాగోతం బయటపడింది. హైదరాబాద్​లోని చందానగర్​లో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

పోలీసుల కథనం ప్రకారం... హైదరాబాద్​లోని చందానగర్​కు చెందిన సాఫ్ట్​వేర్​ ఉద్యోగి చంద్రశేఖర్​కు హిమాతో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. భార్య కూడా సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని (Software Job) కావడంతో ఆర్థికంగా కొన్ని రోజులు బాగానే గడిచాయి. ఇంతలో వారి ప్రేమకు గుర్తుగా ఓ కుమార్తె కూడా జన్మించింది. చక్కని ఉద్యోగాలు, మంచి జీవితం.. ఓ చిన్నారి.. ఇలా జీవితం సాఫీగా వెళ్తున్న తరుణంలో ఏడాది క్రితం చంద్రశేఖర్​ ఉద్యోగం కోల్పోయాడు. దీంతో చంద్రశేఖర్​ ఆత్మన్యూనతకు గురయ్యాడు. తరచూ భార్యతో గొడవలు పెట్టుకునేవాడు. ఇది నచ్చని హిమ.. చిన్నారి మోక్షజ(8)తో కలిసి తన సొంతింటికి వెళ్లిపోయింది.

Father killed daughter at Hyderabad : సుమారుగా ఏనిమిది నెలలుగా భర్తకు దూరంగా ఉంటుంది. ఇది నచ్చని చంద్రశేఖర్​.. ఎలాగైనా భార్యకు ఆనందాన్ని దూరం చేయాలనుకున్నాడు. తన భార్యకు ఎంతో ఇష్టమైన తన సొంత కుమార్తెను అని కూడా చూడకుండా.. మోక్షజను బ్లేడ్​తో గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు పథకం రచించాడు. హైదరాబాద్​ శివారు ప్రాంతంలోని పెద్దఅంబర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌ (ORR) వద్ద మృతదేహాన్ని పడేసేందుకు యత్నించాడు.

ఈ క్రమంలో కారు నడుపుతూ వస్తుండగా.. అతని కారు డివైడర్​ను ఢీకొంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లారు. కారు వెనుక భాగంలో చిన్నారి మృతదేహాన్ని చూశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా... అసలు విషయం బయటకు వచ్చింది. చిన్నారిని తానే చంపినట్లు తండ్రి చంద్రశేఖర్​ అంగీకరించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

చంద్రశేఖర్‌లో వింత ప్రవర్తన: భార్యకు దూరంగా ఉంటున్న చంద్రశేఖర్​.. పాపను మాత్రం తరచూ కలిసేవాడు. బీహెచ్‌ఈఎల్‌ జ్యోతి విద్యాలయంలో మోక్షజ చదువుతుండగా.. శుక్లవారం సాయంత్రం3 గంటలకు స్కూల్‌ నుంచి పాపను చంద్రశేఖర్ తీసుకెళ్లాడు. కారులోనే చిన్నారిని హత్య చేసి మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్లాన్​ చేసుకున్నాడు. ఈ క్రమంలో ఓఆర్‌ఆర్‌ వద్ద కారు ప్రమాదానికి గురైయ్యింది. దీనిపై రాత్రి 10.30గంటల సమయంలో పోలీసులకు సమాచారం వచ్చింది.

"భార్యపై కోపంతోనే కుమార్తెను చంద్రశేఖర్‌ హత్య చేశాడు. బీహెచ్‌ఈఎల్‌ జ్యోతి విద్యాలయంలో మోక్షజ చదువుతుంది. నిన్న సా.3 గంటలకు స్కూల్‌ నుంచి చంద్రశేఖర్ తీసుకెళ్లాడు. మార్గమధ్యలో కారులో కుమార్తెను హత్య చేశాడు. రాత్రి 10.30 గంటలకు ఓఆర్‌ఆర్‌ వద్ద యాక్సిడెంట్ అయినట్లు సమాచారం వచ్చింది. కుమార్తెను చంపాలని చంద్రశేఖర్‌ ముందస్తు పథకం పన్నాడు. ఓఆర్‌ఆర్‌ కోహెడ వద్ద మోక్షజ బాడీని డిస్‌పోజ్ చేయాలనుకున్నాడు. 3 రోజులకు ఓసారి పాపను చూడడానికి చంద్రశేఖర్‌ వెళ్తున్నాడు. ఆర్ధిక ఇబ్బందులు, భార్య హిమ బిందుపై ఉన్న కోపంతో హత్య చేశాడు". - భీంరెడ్డి, వనస్థలిపురం ఏసీపీ

Woman Dies of Heart Stroke Warangal : బిడ్డకు పాలిచ్చి.. నిద్రలోనే గుండెపోటుతో తల్లి మృతి

అల్లుడి ఘాతుకం.. పెళ్లైన రెండు వారాల్లోనే భార్య, అత్త హత్య

Woman Murder Case: వివాహిత హత్య కేసులో బయటపడిన నిజం.. ఆమెను మట్టుపెట్టింది అతనే

Last Updated : Aug 19, 2023, 9:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.