సాంప్రదాయ పంటల నుంచి రైతులను మళ్లించే క్రమంలో శ్రీగంధం సాగు ప్రత్యామ్నాయంగా కనిపిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. శ్రీగంధం సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహించాలన్నారు. రైతులు సంరక్షించిన చెట్లను 15 ఏళ్ల తర్వాత ప్రభుత్వమే కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
చాలా రాష్ట్రాల్లో పలు ప్రైవేటు కంపెనీలు రైతులతో నేరుగా తామే కొంటామని ఒప్పందం చేసుకుంటున్నాయని మంత్రి వివరించారు. బెంగుళూరు మల్లేశ్వరంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో జరిగిన సమావేశానికి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. శ్రీగంధం మొక్కలకు ప్రూనింగ్ చెట్లకు వుడ్ పరీక్ష చేయడం మూలంగా దాని ఎదుగుదలకు నష్టం జరుగుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
సాంప్రదాయంగా సాధారణ పద్ధతిలోనే పెరగనివ్వాలని సినీయర్ శాస్త్రవేత్తలు తెలుపుతున్నట్లు మంత్రి వివరించారు. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్ ప్రధాన శాఖను సందర్శించారు. కంపెనీ ఉత్పత్తులు, మార్కెట్ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట తెలంగాణ ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ విశ్వవిద్యాలయం వీసీ నీరజ ప్రభాకర్ ఉన్నారు.
ఇదీ చదవండి: భారతీయ కంపెనీల చేతుల్లోనే 5జీ నెట్‌వర్క్!