ETV Bharat / state

Debt Relief Commission: 'భూమిని నమ్ముకున్న వారిని వేధించడం తగదు'

author img

By

Published : Feb 26, 2022, 9:15 PM IST

Debt Relief Commission: అప్పులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న రైతులు ఇవాళ రైతురుణ కమిషన్‌ను ఆశ్రయించారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరుతున్న నేపథ్యంలో వీరు కమిషన్‌ను కలిసి తమ ఆవేదనను వెలిబుచ్చారు.

Farmer
Farmer

Debt Relief Commission: ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుంచి అప్పుతీసుకున్న 12 మంది రైతులు సకాలంలో అప్పులు చెల్లించకపోవడం వల్ల వడ్డీ వ్యాపారులు రైతుల ఫొటోలు బ్యాంకు నోటీసు బోర్డులపై అంటిస్తున్నారని వాపోయారు. అంతే కాకుండా తమ పేర్లను ఊళ్లో చాటింపులు వేయించడం, రైతుల ఇళ్లకు తాళాలు వేయడం వంటి చేయడం వల్ల అప్పులు చెల్లించలేని 12 మంది రైతులు ఇవాళ రైతు రుణ ఉపశమన కమిషన్‌ను ఆశ్రయించారు.

ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్థుల నుంచి అప్పు తీసుకుని పంటలు పండక, అప్పు చెల్లించక వడ్డీలు పెరిగి అప్పు తీర్చలేని రైతులు కమిషన్‌ను ఆశ్రయించారు. కమిషన్ ఛైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు, సభ్యులు కవ్వ లక్ష్మారెడ్డి, పాకాల శ్రీహరిరావు, కమిషన్ సెక్రటరీ ఎన్.శారదాదేవి నేతృత్వంలో విచారణ జరిపారు. రైతులు... గ్రామాలు విడిచిపోయే వారు కాదని కమిషన్ తెలిపింది. భూమిని నమ్ముకుని బతుకుతున్న వారిని చిన్న చిన్న అప్పుల వసూళ్ల కోసం రైతుల ఫొటోలు, బ్యాంకు నోటీసు బోర్డులపై పెట్టడం, చాటింపులు వేయించడం, ఇళ్లకు తాళాలు వేయడం లాంటి పనులు అమానవీయని పేర్కొంది. అలాంటివి చేయకూదని కమిషన్ హెచ్చరించింది.

ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు మూడు నుంచి నాలుగు రూపాయల మిత్తితో వసూలు చేయడానికి దాడులు చేయడం, భూములు లాక్కోవడాన్ని కమిషన్ తీవ్రంగా పరిగణించింది. కోర్టుకు హాజరైన కొందరు బ్యాంకర్లు సమగ్రంగా లోన్ స్టేట్‌మెంట్ సమర్పించకపోవడం వల్ల విచారణను కమిషన్ వారం రోజులు వాయిదా వేసింది.

ఇదీ చూడండి : చలాన్లు ఉన్న వాహనదారులకు ట్రాఫిక్​ పోలీసుల గుడ్​న్యూస్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.