Farmers Day celebrations in Telangana : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా తదితర పథకాల విశిష్టతను తెలిపేలా ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టింది. వ్యవసాయం దండుగ అన్న చోటే పండుగైందని... నెర్రెలు బారిన ఈ నేల... దశాబ్దిలోపే రెండు కోట్ల ఎకరాల పచ్చని మాగాణమైందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
సాంప్రదాయ పంటలను సాగు చేస్తున్న రైతులు... సాంకేతికను అందిపుచ్చుకొని మార్కెట్లో లాభదాయకమైన మెరుగైన పంటలను సాగు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. రైతు దినోత్సవం సందర్భంగా వనపర్తి పట్టణ శివారులోని రైతు వేదికకు ఎడ్ల బండిపై మంత్రి ర్యాలీగా వెళ్లారు. తన జీవితం ఉన్నంతవరకు అన్నదాత అభ్యున్నతి కోసమే పని చేస్తానన్న మంత్రి.. కష్టాన్ని నమ్ముకుని పనిచేసే వారు ఎప్పటికీ చెడిపోరని పేర్కొన్నారు.
Farmers Day celebrations in Telangana : నిర్మల్ మండలం న్యూ పోచంపాడులో నిర్వహించిన రైతు దినోత్సవంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వన్నెల్-బిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎండ్లబండిపై వచ్చిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి.. బీఆర్ఎస్ సర్కార్ రైతు సంక్షేమం కోసం చేపట్టిన పథకాలను వివరించారు. కామారెడ్డి జిల్లా పద్మాజీవాడీ క్రాస్ వద్ద గల రైతువేదికలో నిర్వహించిన.. రైతు దినోత్సవంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. పద్మాజీవాడీ చౌరస్తా నుంచి రైతు వేదిక వరకు ఎడ్లబండిపై ర్యాలీగా వచ్చిన కవిత.. ఎమ్మెల్యే సురేందర్‌తో కలిసి రైతువేదికను ప్రారంభించారు.
"నేను రైతును అని చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. రైతు అంటే అప్పులు లేకుండా ఉండాలనేదే కేసీఆర్ ఆలోచన. ఆ విధంగానే తాము పనిచేస్తున్నాం." - కవిత, ఎమ్మెల్సీ
Telangana Decade Celebrations : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రాయగూడెం వేడుకల్లో రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండలో మంత్రి సత్యవతి రాఠోడ్ ప్రభుత్వ అభివృద్ధిని వివరించారు. రైతుబంధు, బీమా, 24గంటల విద్యుత్‌తో బీఆర్ఎస్ సర్కార్ రైతు ప్రభుత్వంగా గుర్తింపు పొందిందని.. వరంగల్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో.. నష్టపరిహారం డబ్బులు వేసి సీఎం కేసీఆర్ చిత్తశుద్ధిని చాటుకున్నారని ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టంచేశారు.
హైదరాబాద్ మలక్‌పేట వ్యవసాయ మార్కెట్‌లో హోం మంత్రి మహమూద్ అలీ రైతులు, ట్రేడర్స్‌ను సన్మానించారు. సికింద్రాబాద్ బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్ యార్డులో జరిగిన రైతు సదస్సులో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు. అన్నదాతను రాజు చేయాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తోందని.. మేడ్చల్ మండలం రాయిలాపూర్‌లో మంత్రి మల్లారెడ్డి అన్నారు.
Decade Celebrations telangana : మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఎమ్మెల్యే బాల్క సుమన్, వర్ధన్నపేట మండలం కట్యాలలో ఎమ్మెల్యే అరూరి రమేష్, ఎండ్లబండ్లను నడిపి ఉత్సాహం నింపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో సుమారు 300 ట్రాక్టర్లతో పథకాల్ని వివరిస్తూ ప్రదర్శన చేపట్టారు. ఇల్లెందులో ఎమ్మెల్యే హరిప్రియ ట్రాక్టర్ నడిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఎమ్మెల్యే సతీశ్, ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో ఎమ్మెల్యే జోగు రామన్న ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని వివరించారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లిటీ, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు, హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో రైతు దినోత్సవాల్నినిర్వహించారు.
ఇవీ చదవండి: