ETV Bharat / state

ప్రపంచవ్యాప్తంగా మహనీయుడు పీవీ శతజయంతి ఉత్సవాలు - pv birthday celebrations in new zealand

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పీవీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా దేశాల్లో స్థానికంగా ఉన్న తెరాస, తెలంగాణ, తెలుగు సంఘాల వారు పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

farmer-pm-pv-narasimha-rao-birthday-celebrations-in-abroad
ప్రపంచవ్యాప్తంగా పీవీ జయంతి వేడుకలు
author img

By

Published : Jun 28, 2020, 8:45 PM IST

వివిధ దేశాల్లో ఉన్న ప్రవాసులు పీవీ జంయత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. పీవీ సేవలను స్మరించుకుని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్, సిడ్నీ, కాన్‌బెర్రా, అడిలైడ్, బ్రిస్బేన్‌ ప్రాంతాల్లో తెరాస ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పీవీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

డెన్మార్క్ యూరోప్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ శ్యామ్ బాబు ఆకుల, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్, తెరాస డెన్మార్క్, డెన్మార్క్ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పీవీ శతజయంతి వేడుకలను జరిపారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు డెన్మార్క్‌లో పీవీ నరసింహారావు విగ్రహ ఆవిష్కరణకు కృషి చేస్తామని తెలిపారు.

తెరాస మలేషియా, తెలంగాణ మలేషియా అసోసియేషన్ ఆధ్వర్యంలో భౌతిక దూరాన్ని పాటిస్తూ.. పీవీ శతజయంతి ఉత్సవాలను మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ఘనంగా నిర్వహించారు.

న్యూజిలాండ్‌లోనూ పీవీ నరసింహారావు శతజయంత్యుత్సవాలు నిర్వహించారు. కొవిడ్‌ నేపథ్యంలో ప్రవాసులు తమ స్వగృహాల్లో పీవీని స్మరించుకుని నివాళులు అర్పించారు. పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రవాసులు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా పీవీ జయంతి వేడుకలు

ఇదీ చూడండి: పీవీజీ.. భరతమాత ముద్దుబిడ్డ: మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.