Tension at TS Raj Bhavan: రైతుల సమస్యలపై సంయుక్త కిసాన్ మోర్చా, ఆదివాసి అటవీ హక్కుల సంరక్షణ సమన్వయ కమిటీ నాయకులు ఛలో రాజ్‌భవన్ కార్యక్రమం చేపట్టారు. ఖైరతాబాద్ మెట్రోస్టేషన్ నుంచి రాజ్‌భవన్ ముట్టడికి బయలుదేరిన ఈ నేతలను పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టి అడ్డుకున్నారు. పోలీసులు నిలువరిస్తున్నా.. నాయకులు రాజ్‌భవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.
పోలీసులు ముందుకు వెళ్లనీయకపోవడంతో రైతు సంఘాల నాయకులు ఖైరతాబాద్ మెట్రోస్టేషన్ వద్దే బైఠాయించి ధర్నా చేపట్టారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని, అటవీ సంరక్షణ నియమాలు 2022 ఉపసంహారించుకోవాలని కోరుతూ దేశ వ్యాప్త పిలుపులో భాగంగా సంయుక్త కిసాన్ మోర్చా ఛలో రాజ్‌భవన్‌కు పిలుపు నిచ్చారు. మెట్రో స్టేషన్ వద్ద ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సాగర్, పశ్య పద్మ, పీవోడ్ల్యూ సంధ్యను పోలీసులు అరెస్టు చేశారు.
ఇవీ చదవండి: