ETV Bharat / state

రాష్ట్ర ఫిషరీస్ కమిషనర్ సువర్ణకు మత్స్యభవన్​లో వీడ్కోలు - hyderabad Fisheries Latest News

హైదరాబాద్​ మాసబ్ ట్యాంక్ పరిధిలోని మత్స్య భవన్​లో మత్స్యశాఖ కమిషనర్ సువర్ణకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవలే జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు ముఖ్య కార్యనిర్వాహక అధికారిణిగా ఆమె నియమితులయ్యారు.

రాష్ట్ర ఫిషరీస్ కమిషనర్ సువర్ణకు మత్స్యభవన్​లో వీడ్కోలు

author img

By

Published : Jul 2, 2020, 10:53 PM IST

హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ పరిధి శాంతినగర్​లోని మత్స్య భవన్​లో రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ సువర్ణకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనల్ ఫిషరీస్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్​గా నియామకం పట్ల హైదరాబాద్ జిల్లా మత్స్య పారిశ్రామిక సంఘం ఛైర్ పర్సన్ కొప్పు పద్మ బెస్త శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పుష్పగుచ్ఛం ఇచ్చి ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్​గా మత్స్యసహకార సంఘాల బలోపేతానికి సువర్ణ ఎంతో కృషి చేసినట్లు పద్మ గుర్తు చేసుకున్నారు.

భవిష్యత్​లోనూ అండగా ఉంటారని...

మత్స్య సహకార సంఘాల సమస్యలను సావధానంగా విని.. వాటి పరిష్కారానికి కృషి చేశారని పద్మ కొనియాడారు. ప్రస్తుతం జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు ముఖ్య కార్యనిర్వహణ అధికారిణిగా కేంద్ర ప్రభుత్వ పథకాలను మత్స్యకారులకు అందించడంలో కృషి చేస్తారని పద్మ ధీమా వ్యక్తం చేశారు. గత మూడున్నర సంవత్సరాలుగా తెలంగాణ మత్స్యశాఖ కమిషనర్​గా మత్స్య సహకార సంఘాలకు, మత్స్య అభివృద్ధికి తోడ్పాటు అందించినందుకు ఎన్ఎఫ్​డీబీ నూతన సీఈఓ సువర్ణకు ధన్యవాదాలు తెలియజేశారు. సొసైటీ సమస్యల పరిష్కారంలో నేషనల్ బోర్డు తరఫునా తమకు ఎల్లప్పుడూ అండగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా మత్స్య పారిశ్రామిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : కోదండరాం నిరసన దీక్ష.. ప్రజల బతుకులు కాపాడాలని డిమాండ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.