ETV Bharat / state

హైకోర్టు సీజే జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్​కు ఘనంగా వీడ్కోలు - తెలంగాణ వార్తలు

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్​కు న్యాయవాదులు, సిబ్బంది వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తీసుకొచ్చిన పలు కార్యక్రమాలను ఆయన గుర్తుచేసుకున్నారు.

ts cj
ts cj
author img

By

Published : Jan 4, 2021, 10:29 PM IST

ఉత్తరాఖండ్​కు బదిలీ అయిన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్​కు న్యాయవాదులు, సిబ్బంది వీడ్కోలు పలికారు. కోర్టు సభ్యులందరూ హాజరై వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. కరోనా పరిస్థితుల్లోనూ అన్ని బెంచ్​లు నడిపామని, జ్యుడీషియల్ అకాడమీలోనూ ఆన్ లైన్ తరగతులు నిర్వహించామని జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్​ గుర్తుచేశారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది సహకారంతోనే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.

దేశంలో వేసవి సెలవులను మొదట రద్దు చేసింది తెలంగాణ హైకోర్టేనని జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ అన్నారు. ఇంటి వద్దకే న్యాయం చేర్చాలన్నస్పూర్తితో మొబైల్ కోర్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. పేదలకు న్యాయం అందేలా న్యాయవాదులు కృషి చేయాలని ఆయన కోరారు. సీనియర్ న్యాయవాదులు జూనియర్లకు మార్గదర్శనం చేయాలన్న ఆయన.. సీనియర్ల విజ్ఞానం, అనుభవాన్ని అందిపుచ్చుకునేందుకు జూనియర్లు ప్రయత్నించాలని సుచించారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం జస్టిస్ చౌహాన్​కు వీడ్కోలు సమావేశం నిర్వహించింది.

ఇదీ చూడండి: పట్టు వీడని రైతులు- మెట్టు దిగని కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.