ETV Bharat / state

మల్లు స్వరాజ్యంకు ప్రముఖుల నివాళి.. నల్గొండకు భౌతికకాయం తరలింపు

author img

By

Published : Mar 20, 2022, 10:05 AM IST

Updated : Mar 20, 2022, 10:28 AM IST

Mallu Swarajyam : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్‌ మల్లు స్వరాజ్యం భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. హైదరాబాద్​లోని ఎంబీభవన్​కు ఆమె పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం తరలించారు. మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ కవితతో పాటు సీపీఎం నాయకులు నివాళులర్పించారు.

Mallu Swarajyam
నివాళులర్పించిన చాడ, నారాయణ

Mallu Swarajyam: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్‌ మల్లు స్వరాజ్యం మృతిపట్ల రాష్ట్ర గవర్నర్ తమిళిసై సంతాపం ప్రకటించారు. సాయుధ పోరాటంలో స్వరాజ్యం సాహసం ఎందరికో స్పూర్తి అని కొనియాడారు. కష్ట సమయంలో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్​లో ఆమె భౌతికకాయానికి ప్రముఖ రాజకీయ నాయకులు నివాళులర్పించారు. ఎంబీ భవన్​లో మంత్రి ఎర్రబెల్లి, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, తెరాస ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి ఆమె పార్థీవదేహానికి నివాళులర్పించారు.

Mallu Swarajyam
నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్సీ కవిత

క్రమశిక్షణకు మారుపేరు: ఎర్రబెల్లి

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం భౌతికకాయానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు. ఎంతోమంది నేతలు, కార్యకర్తలకు ఆమె పూర్తి అండగా నిలిచారని ప్రశంసించారు. ఆమె పేదల కోసం పోరాడిందని తెలిపారు. స్వరాజ్యం మరణం దేశానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆమె పేరిట ఎన్నో పుస్తకాలు, సినిమాలు రావాలని.. అవసరమైతే ప్రభుత్వం తరఫున సాయం చేస్తామని మంత్రి అన్నారు.

Mallu Swarajyam
నివాళి అర్పిస్తున్న మంత్రి ఎర్రబెల్లి

పేదల కోసం వీరోచిత పోరాటం: కోదండరాం

మల్లు స్వరాజ్యం పేదల కోసం వీరోచిత పోరాటాలు చేశారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం కొనియాడారు. రాజకీయాలు వ్యాపారం కాదు ప్రజలకు శక్తినిచ్చే ఆయుధమని చాటి చెప్పారని ప్రశంసించారు. ఎంబీ భవన్​లోని ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించారు.

Mallu Swarajyam
నివాళులర్పిస్తున్న ప్రొఫెసర్ కోదండరాం

ఆమె ఎందరికో స్ఫూర్తి: నారాయణ

స్వరాజ్యం పోరాటాలు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మల్లు స్వరాజ్యం త్యాగాలు, పోరాట గాథలు చిరస్మరణీయమని కొనియాడారు. స్వరాజ్యం కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. ఎంబీ భవన్‌లో మల్లు స్వరాజ్యం భౌతికకాయానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి నివాళులర్పించారు.

మల్లు స్వరాజ్యంకు ప్రముఖుల నివాళి

నల్గొండకు భౌతికకాయం తరలింపు

మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని నల్గొండకు తరలిస్తారు. నల్గొండ పార్టీ కార్యాలయంలో జరగనున్న ఆమె సంతాప సభ నిర్వహిస్తారు. పార్టీ శ్రేణుల నివాళుల అనంతరం భౌతికకాయం వైద్య కళాశాలకు అప్పగిస్తారు. స్వరాజ్యం చివరి కోరిక మేరకు భౌతికకాయం వైద్య కళాశాలకు ఇవ్వనున్నట్లు కుటుంబీకులు తెలిపారు.

ఇవీ చదవండి :

Last Updated : Mar 20, 2022, 10:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.