శైలేష్ పటేల్ కుటుంబం 40 ఏళ్ల క్రితం వ్యాపారం నిమిత్తం గుజరాత్ నుంచి అమెరికాకు వలస వెళ్లి.. అక్కడే స్థిరపడింది. అయితే తమకు మంచి జీవితాన్నిచ్చిన దేశ అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల 24న భారత్‌కు వస్తున్నారని తెలుసుకున్నారు. ఆయన కోసం నిర్వహించే 'నమస్తే ట్రంప్' గురించి తెలుసుకొని ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ కార్యక్రమాన్ని తిలకించేందుకు వెంటనే భారత్ చేరుకుంది ఆ కుటుంబం.
ప్రస్తుతం శైలేష్ కుటుంబం సూరత్‌లో ఉంది. ప్రధాని మోదీతో గత కొన్నేళ్లుగా వీరికి సన్నిహిత సంబంధాలున్నాయి. రెండోసారి మోదీ ప్రధాని అయిన తర్వాత ఆయన్ను శైలేష్ కుటుంబం కలిసింది. ట్రంప్ భారత్ పర్యటనతో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు శైలేశ్ కుటుంబసభ్యులు.
ఇదీ చదవండి: ఉత్తరప్రదేశ్‌లో బయటపడ్డ టన్నులకొద్దీ పసిడి!