ETV Bharat / state

నకిలీ మెయిల్స్​ పంపించి టోకరా - cyber criminal case

కరోనా సమయం‌లోనూ సైబర్‌ నేరాలు తగ్గడం లేదు. బాధితుల అమాయకత్వం, అలసత్వం, నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తమ యజమాని పంపించినట్లుగా ఓ మహిళకు మెయిల్​ పంపించి లక్ష రూపాయల విలువ గల కానుకలను కాజేశాడు ఓ ఆగంతుకుడు. విషయం గ్రహించిన బాధితురాలు సైబర్​ క్రైమ్​ పోలీసులను ఆశ్రయించింది.

fake email cheating in hyderabad
నకిలీ మెయిల్స్​ పంపించి టోకరా
author img

By

Published : Jun 7, 2020, 5:07 PM IST

కంప్యూటర్ యుగంలో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అంతుపట్టని పరిస్థితి. మనం మేల్కొనేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. హైదరాబాద్​ శ్రీనగర్ కాలనీకి చెందిన రాజ్యలక్ష్మి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో పని చేస్తారు. ఇటీవల తమ విద్యా సంస్థల అధినేత పంపించినట్లుగా ఆమెకు ఓ నకిలీ మెయిల్ వచ్చింది. అందులో సూచించినట్లుగా ఒకసారి 70వేలు, మరోసారి 30వేల విలువైన కానుకలను అమెజాన్​లో కొని పంపించారు.

ఆ తర్వాత కూడా మరో రెండు పంపించాలని మెయిల్ వచ్చింది. దాంతో రాజ్యలక్ష్మి అప్రత్తమయ్యారు. విద్యా సంస్థల అధినేతకు విషయం చెప్పారు. అలాంటి మెయిల్స్ తానెప్పుడూ పంపించలేదన్నారు. దీంతో ఆమె హైదరాబాద్​ సైబర్ క్రైమ్​ పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: మొక్కలు నరికిన వ్యక్తిపై కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.