ETV Bharat / state

నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న ముగ్గురు అరెస్టు - secunderabad latest news

అక్రమంగా నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్న ముగ్గురిని టాస్క్​ఫోర్స్​ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులంతా స్నేహితులని.. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే దురాశతో ఈ పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ. 10 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న ముగ్గురు అరెస్టు

author img

By

Published : Jun 25, 2020, 10:06 PM IST

సికింద్రాబాద్​లో అక్రమంగా నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్న ముగ్గురిని ఉత్తర మండల టాస్క్​ఫోర్స్​ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 10 లక్షల విలువైన.. 660 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, టాస్క్​ఫోర్స్​ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.

నరోత్తం రెడ్డి, వేణుమాధవ్, శ్రీనివాస్ విత్తనాలను సరఫరా చేసే ఏజెంట్లుగా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లా ఆత్మకూరుకు చెందిన నరోత్తం రెడ్డి మెదక్ జిల్లాలో విత్తనాల సరఫరా ఏజెంట్​గా పని చేస్తూ దుకాణాన్ని నడుపుతున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో తన స్నేహితులైన కుమురం భీం జిల్లాకు చెందిన వేణుమాధవ్, మంచిర్యాలకు చెందిన శ్రీనివాస్​లతో కలిసి నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నారు.

నిందితులు తమ స్నేహితులైన గుజరాత్ రాష్ట్రానికి చెందిన ప్రవీణ్ పటేల్, భరత్ పటేల్ నుంచి నకిలీ పత్తి విత్తనాలను అనధికారికంగా కొనుగోలు చేసుకునేవారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ నకిలీ విత్తనాలను సరఫరా చేసి సొమ్ము చేసుకోవాలన్నది వారి ఆలోచన. దీని ప్రకారం హైదరాబాద్, కామారెడ్డి, సిద్దిపేట తదితర ప్రాంతాలలో ఏజెంట్ల ద్వారా విత్తనాలను రూ. 800కు కొనుగోలు చేసి రూ. 1500కు కిలో చొప్పున అమ్ముతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇవీ చూడండి: హరితహారంలో కేసీఆర్​.. నర్సాపూర్​ అర్బన్ ఫారెస్ట్​ ప్రారంభించిన సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.