ETV Bharat / state

నకిలీ ఇంటి పత్రాలు తయారు చేసిన ముఠా అరెస్టు - మరణించిన వారి ఫెక్​ ఇంటి పత్రాలు తయారు

ఓ వ్యక్తికి ముగ్గురు ఇంటి స్థలాన్ని అమ్మారు.. తీరా కొన్న తర్వాత తెలిసింది. అది వేరే వాళ్లదని. ఆ భూమి కుటంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఆరా తీస్తే వారు నకిలీ పత్రాలు తయారు చేసి అమ్ముతున్నారని తేలింది. పోలీసులు దర్యాప్తు చేసి ఆ కేటుగాళ్లను పట్టుకున్నారు.

fake certificate gang arrested at ghatkesar
నకిలీ ఇంటి పత్రాలు తయారు చేసిన ముఠా అరెస్టు
author img

By

Published : Jun 5, 2020, 6:17 AM IST

ఇంటి స్థలానికి నకిలీ దస్త్రాలు సృష్టించి విక్రయించడానికి ప్రయత్నించిన ముగ్గురు సభ్యుల ముఠాను ఘట్‌కేసర్‌ పోలీసులు అరెస్టు చేశారు. మృతి చెందిన వ్యక్తి పేరిట ఉన్న ఖాళీ ఇంటి స్థలానికి వారు ఫేక్​ పత్రాలు సృష్టించారు. పోచారం గ్రామానికి చెందిన మేడి జగన్నాథంకు అదే గ్రామంలో సర్వే నెంబర్‌ 36లో 200 గజాల ఇంటి స్థలం ఉంది. 2012లో ఆయన మృతి చెందారు.

జగిత్యాల జిల్లా మెట్‌పల్లికు చెందిన సత్తిరెడ్డి, నరేందర్‌, నవీన్‌లు కలిసి కుట్ర పన్ని ఆ ఇంటి స్థలానికి సంబంధించి నకిలీ పత్రాలు తయారు చేసి విక్రయించారు. సమచారం తెలిసిన జగన్నాథం కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేసి ఆ ముఠాకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు.

ఇదీ చూడండి: ఆదిలాబాద్‌లో గ్యాంగ్‌వార్‌.. పరారీలో తెరాస కౌన్సిలర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.