ఎన్‌ఐఏ అదనపు ఎస్పీగా చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్‌ఆర్ కడప జిల్లాకు చెందిన చెందిన గురు వినోద్ నగరంలోని గోల్కోండ ప్రాంతంలో నివసిస్తున్నాడు. నకిలీ ఐపీఎస్ అధికారి అవతారం ఎత్తిన వినోద్ ఎయిర్ పోర్టు అధికారిగా, ఎన్‌ఐఏ అదనపు ఎస్పీగా చెలామణి అవుతుండేవాడు. ఇలా విశ్రాంత మేజర్ శ్రీనివాస్‌రావుతో పరిచయం పెంచుకున్నాడు. శ్రీనివాస్ రావు తనకు పరిచయం ఉన్న కొందరు ఐపీఎస్ అధికారులను వినోద్‌కు పరిచయం చేశాడు. నిందితుడు తాను ఎన్‌ఐఏ అదనపు ఎస్పీగా చెప్పుకుంటూ సొంత పనులు చేయించుకునేవాడు.
విచారించగా
వినోద్ నకిలీ గుర్తింపుకార్డు ద్వారా రైల్వే రిజర్వేషన్లు వివిధ ఆలయాల్లో ప్రత్యేక దర్శనాలు చేసుకునేవాడు. అతని వ్యవహరశైలిపై అనుమానం వచ్చిన విశ్రాంత మేజర్ ఎన్‌ఐఏ కార్యాలయంలో విచారించగా అతను నకిలీ అధికారని తేలింది. ఈ మేరకు శ్రీనివాస్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురు వినోద్‌ను పట్టుకున్నారు. నిందితుని నుంచి నకిలీ తుపాకి, బోగస్ గుర్తింపు కార్డు, రబ్బరు స్టాంపులు 6చరవాణులు ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఇవీ చూడండి: మరో అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం