ETV Bharat / state

పనికొచ్చే సీట్లు పెంచుదాం: నిపుణుల కమిటీ - Expert Committee report on Engineering Education in Telangana

నిబంధనలను పాటించే ఇంజినీరింగ్‌ కళాశాలల్లో డిమాండ్‌ ఉన్న సీట్లను పెంచుకోవడానికి అనుమతిస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి నిపుణుల కమిటీ సిఫార్సు చేయనుంది. 2020-21 విద్యా సంవత్సరానికి దృక్కోణ ప్రణాళికను పంపించాలని గత నెల 31న ఏఐసీటీఈ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది.

experts commitee on ts engineering education
పనికొచ్చే సీట్లు పెంచుదాం
author img

By

Published : Jan 29, 2020, 10:10 AM IST

'విద్యార్థుల నుంచి బాగా డిమాండ్‌ ఉన్న బీటెక్‌ కోర్సులు రెండే రెండు. అవి కంప్యూటర్‌ సైన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ. ఏఐసీటీఈ, విశ్వవిద్యాలయాలు మాత్రం రెండు మూడు సెక్షన్లకు మించి అనుమతి ఇవ్వరాదని పరిమితి విధిస్తున్నాయి. ఫలితంగా కోరుకున్న కోర్సు కోసం కొందరు నాసిరకం కళాశాలల్లో చేరుతున్నారు. మరికొందరు ఇష్టం లేకున్నా ఇతర కోర్సుల్లో ప్రవేశాలు పొంది నష్టపోతున్నారు. విద్యార్థులకు ప్రయోజనం కలగాలంటే డిమాండ్‌ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచడం మంచిదని నిపుణుల కమిటీ సూచిస్తోంది.'
-రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నియమించిన నిపుణుల కమిటీ

ఇంజినీరింగ్‌ విద్యలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం, నూతన కళాశాలలకు అనుమతులు తదితర అంశాలపై 2020-21 విద్యా సంవత్సరానికి దృక్కోణ ప్రణాళికను పంపించాలని గత నెల 31న అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) అన్ని రాష్ట్రాలను కోరుతూ లేఖలు రాసింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌.. ఐఐటీ హైదరాబాద్‌ సంచాలకుడు బీఎస్‌ మూర్తి, ట్రిపుల్‌ఐటీ సంచాలకుడు నారాయణ్‌, ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షులు లింబాద్రి, వెంకటరమణ తదితరులతో నిపుణుల కమిటీని నియమించారు. రాష్ట్రంలో కన్వీనర్‌ కోటా కింద భర్తీ అవుతున్న బీటెక్‌ సీట్లలో కేవలం సీఎస్‌ఈ, ఐటీ బ్రాంచీల్లో చేరుతున్న వారే 43.34 శాతం మంది ఉన్నారు. యాజమాన్య సీట్లనూ కలుపుకొంటే 50 శాతం దాకా ఉంటారు. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ కమిటీ ఇటీవల సమావేశమై ప్రణాళికపై చర్చించింది. వచ్చే నెల 5న మరోసారి చర్చించి తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. ప్రభుత్వం దాన్ని ఏఐసీటీఈకి అందజేయనుంది.

కమిటీ ఆలోచనలు ఇవీ..

రాష్ట్రంలో 2015 నుంచి కన్వీనర్‌, యాజమాన్య కోటాలో భర్తీ అవుతున్న సీట్లు 70 వేలకు మించడం లేదు. కన్వీనర్‌ కోటాలో 2015లో 51,630 సీట్లు ఉండగా 2019లో అవి 46,115కు తగ్గిపోయాయి. ఏఐసీటీఈ 1.10 లక్షల సీట్లను మంజూరు చేస్తుండగా భర్తీ అవుతోంది మాత్రం అందులో 60 శాతానికి మించడం లేదు. అంటే మొత్తం మంజూరు చేసే సీట్లను తగ్గించొచ్చు. అదే సమయంలో డిమాండ్‌ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచాలి.

  • ఈ విద్యా సంవత్సరం మెకానికల్‌, ఈఈఈ, సివిల్‌ బ్రాంచీల్లో 50 శాతం కన్వీనర్‌ సీట్లు కూడా భర్తీ కాలేదు. అదే సమయంలో సీఎస్‌ఈ, ఐటీలో వరుసగా 91.31, 95.09 శాతం నిండాయి.
  • కోర్‌ గ్రూపులైన మెకానికల్‌, సివిల్‌, ఈఈఈ లాంటి వాటిని కొనసాగిస్తూనే వాటిలో సీట్లు తగ్గించి ఇతర కొత్త కోర్సులను ప్రారంభించే అవకాశం ఇవ్వాలి.
  • ప్రతి బీటెక్‌ కోర్సులో కృత్రిమ మేధ సబ్జెక్టును అనుసంధానం చేయాలి.
  • బీవీఆర్‌ మోహన్‌రెడ్డి సిఫార్సుల మేరకు డేటా సైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ తదితర తొమ్మిది రకాల కోర్సులపై ప్రధానంగా దృష్టి సారించాలి.
    Committee report on Engineering Education in Telangana
    పనికొచ్చే సీట్లు పెంచుదాం

ఇదీ చూడండి: 'రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్​లో గళమెత్తండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.