జమ్ముకశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న తాజా చర్యలపై.. నిపుణులు స్పందిస్తున్నారు. అధికరణం 370, 35ఏ రద్దుతో ఆ రాష్ట్రంలో ఏర్పడే పరిస్థితులను.. జమ్ముకశ్మీర్ వ్యవహారాల నిపుణులు ప్రొఫెసర్ శ్రీమన్నారాయణ.. ఈటీవీ భారత్తో తన అభిప్రాయాలు పంచుకున్నారు. పర్యటకంతోనే చాలామాంది జమ్ముకశ్మీరీలు ఉపాధి పొందుతారని చెప్పారు. 370, 35 ఏ రద్దుతో ఇతర రాష్ట్రాల ప్రజలు జమ్ముకశ్మీర్లో వ్యాపారాలు చేసుకునే వీలు ఉంటుందని.. దీంతో అక్కడి స్థానికుల్లో భయం పెరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. కశ్మీర్ వ్యవహారాల్లో పాకిస్థాన్ జోక్యం ఇకపై తగ్గిపోతుందని.. అంతర్జాతీయ స్థాయిలో ఆ దేశం చేస్తున్న తప్పుడు వాదనలకు ఇకపై ఆస్కారం ఉండదని చెప్పారు.
ఇదీ చూడండి: 'చారిత్రక నిర్ణయంతో 70ఏళ్ల కల సాకారం'