ETV Bharat / state

Beer Sales Increased in Telangana : వేడి పెరిగిందని చల్లగా బీర్లు తాగేస్తున్నారు - Telangana Excise Department Latest News

Beer Sales Increased in Telangana : రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడం.. ఉక్కపోతల నుంచి ఉపశమనం పొందేందుకు మద్యం ప్రియులు లీటర్లకు లీటర్లు బీర్లు తాగేస్తున్నారు. మే నెలలో ఎండలు తీవ్రస్థాయిలో ఉండడంతో.. అదే స్థాయిలోనూ వీటి విక్రయాలు పెరిగాయి. మే నెలలో గడిచిన 20 రోజుల్లో రూ.1,732.29 కోట్ల విలువైన.. 3.56 కోట్ల లీటర్లు బీర్లు.. 1.37 కోట్ల లీటర్ల లిక్కర్‌ను మందుబాబులు తాగేశారు. ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో రికార్డు స్థాయిలో బీర్లు అమ్ముడుపోయినట్లు అబ్కారీ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Beer Sales Increased in Telangana
Beer Sales Increased in Telangana
author img

By

Published : May 22, 2023, 4:54 PM IST

Beer Sales Increased in Telangana : రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రికార్డును సృష్టిస్తున్నాయి. భానుడు భగభగలకు, వడగాల్పుల నుంచి ఉపశమనం కోసం.. లీటర్లకు లీటర్ల బీర్లను మంచి నీళ్లలా మందుబాబులు తాగేస్తున్నారు. మద్యంతో పోలిస్తే బీరు అమ్మకాలు రెట్టింపునకు మించి జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో రూ.2,683.65 కోట్ల విలువైన.. 2.23 కోట్ల లీటర్ల లిక్కర్‌.. 3.99 కోట్ల లీటర్ల బీర్లు అమ్ముడయ్యాయి.

అంటే రోజుకు 7.43 లక్షల లీటర్ల లిక్కర్‌.. 13.29 లక్షల లీటర్ల బీర్లను.. మందుబాబులు తాగేస్తున్నట్లు అబ్కారీ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాజధాని హైదరాబాద్‌ నగరంతోపాటు జిల్లాల్లో కూడా 42 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో వడగాల్పులు, ఉక్కపోతలతో ఇళ్ల నుంచి బయటకు కూడా రాలేని పరిస్థితులు నెలకొన్నాయి.

పెరిగిన లిక్కర్ అమ్మకాలు : మే నెలలో ఎండల తీవ్రత మరింత ముదరడంతో.. అదే స్థాయిలో లిక్కర్ అమ్మకాలు పెరిగాయి. ఈ నెలలో 20వ తేదీ వరకు జరిగిన మద్యం విక్రయాలను పరిశీలించినట్లయితే.. రూ.1,732.29 కోట్ల విలువైన.. 3.56 కోట్ల లీటర్ల బీర్లు.. 1.37 కోట్ల లీటర్ల లిక్కర్‌ అమ్ముడు పోయినట్లు ఎక్సైజ్‌ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే రోజుకు 17.79 లక్షల లీటర్ల బీర్లు.. 6.84 లక్షల లీటర్ల లిక్కర్‌ మందుబాబులు తాగేస్తున్నారు.

అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో : ఏప్రిల్‌ నెలలో రోజుకు సగటున జరిగిన బీరు, లిక్కర్‌ అమ్మకాలను పరిశీలించినప్పుడు.. మే నెలలో మద్యం అమ్మకాలు తగ్గాయి. బీరు విక్రయాలు మాత్రం భారీగా పెరిగినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా మే నెలలో జరిగిన మద్యం అమ్మకాలను పరిశీలించినట్లయితే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.404 కోట్ల విలువైన.. 78.13 లక్షలు లీటర్ల బీర్లు.. 31.73లక్షల లీటర్ల లిక్కర్‌ అమ్ముడుపోయి అత్యధికంగా అమ్మకాలు జరిగిన జిల్లాగా నిలిచింది.

నల్గొండ జిల్లాలో రూ.186.49 కోట్ల విలువైన.. 40.26 లక్షల లీటర్ల బీర్లు, 14.58 లక్షల లీటర్ల లిక్కర్‌ విక్రయాలు జరిగి రెండో స్థానంలో నిలిచింది. వరంగల్‌ జిల్లాలో రూ.164.83 కోట్లు విలువైన 38.62లక్షల లీటర్ల బీర్లు, 11.68లక్షల లీటర్ల లిక్కర్‌ అమ్ముడుపోయి మూడో స్థానంలో నిలిచినట్లు అబ్కారీ శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. రూ.176.45 కోట్ల విలువైన మద్యం అమ్మకాలతో హైదరాబాద్‌ జిల్లా నాలుగో స్థానంలో నిలువగా మహబూబ్‌నగర్‌, మెదక్‌, కరీంనగర్‌ జిల్లాలు వరుసగా ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.

ఇవీ చదవండి: Harish Rao on Job Notification : 'త్వరలోనే 80వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ'

గంగా నదికి పూజ చేసేందుకు వెళ్తుండగా బోటు బోల్తా.. నలుగురు మహిళలు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.