ETV Bharat / state

ఎన్నికల వేళ ఎక్సైజ్​శాఖ అలర్ట్ - వాటి సరఫరాపై ప్రత్యేక నిఘా - తెలంగాణలో మద్యం అమ్మకాలు తగ్గాయి

Excise Department Concentrate Illegal Liquor Supply in Telangana : శాసనసభ ఎన్నికల దృష్ట్యా అనధికారిక మద్యం, గంజాయి సరఫరా, విక్రయాలూ జోరందుకున్నట్లు అబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. సాధారణంగా ఎన్నికల సమయంలో భారీగా మద్యం అమ్మకాలు జరగాల్సి ఉండగా.. విక్రయాలు పెరగకపోవడంతో ప్రభుత్వ ఉన్నతాధికారుల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ రాష్ట్రానికి సరఫరా అవుతున్నట్లు గుర్తించిన అధికారులు.. తనిఖీలు ముమ్మరం చేశారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు తప్పక అమలు చేయాలని ఇప్పటికే ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

Liquor Sales Decreased in Telangana
Liquor Sales Decreased
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 28, 2023, 9:54 PM IST

ఎన్నికల వేళ ఎక్సైజ్​శాఖ అలర్ట్ - వాటి సరఫరాపై ప్రత్యేక నిఘా

Excise Department Concentrate Illegal Liquor Supply in Telangana : రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో మాదకద్రవ్యాలు, అక్రమ మద్యంపై ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు అవసరమైన ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. రాష్ట్రవ్యాప్తంగా 141 ఎక్సైజ్‌ స్టేషన్‌లతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ప్రత్యేక, జిల్లా టాస్క్‌ఫోర్స్‌ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. 34 ఎక్సైజ్‌ తనిఖీ కేంద్రాలు, 44 నిఘా బృందాలు ఏర్పాటు చేసి విధులు నిర్వహిస్తున్నప్పటికీ.. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో గుడుంబా, నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌, గంజాయి, మాదకద్రవ్యాలు సరఫరా అవుతున్నాయి.

గత నెల 9వ తేదీ నుంచి ఈ నెల 25వ తేదీ వరకు రూ.4 వేల 554 కోట్ల విలువైన 45 లక్షల 91 వేల కేసుల లిక్కర్‌.. 65లక్షల 03 వేల కేసుల బీర్లు అమ్ముడు పోయినట్లు అబ్కారీ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా గత ఏడాది అక్టోబరు 9వ తేదీ నుంచి నవంబరు 25వ తేదీ వరకు రూ.4 వేల 114 కోట్ల విలువైన 42 లక్షల 45 వేల కేసుల లిక్కర్‌.. 48 లక్షల 44వేల కేసుల బీర్లు అమ్ముడు పోయాయి.

Excise Department Surveillance on Illegal Liquor Supply : అంతకుముందు ఏడాదిలో జరిగిన అమ్మకాలు, ఈ ఏడాది జరిగిన విక్రయాల విలువతో పోలిస్తే.. కేవలం 10.69 శాతం అధికంగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల దృష్ట్యా భారీగా మద్యం విక్రయాలు పెరగాల్సి ఉండగా.. ఆశించిన మేరకు అమ్మకాలు జరగడం లేదని భావిస్తున్న ఎక్సైజ్‌ శాఖ గుడుంబా, అనధికారిక మద్యం సరఫరాలే కారణమని అంచనా వేస్తుంది.

Excise Department Searches in Telangana : ఎన్నికల వేళ ఎక్సైజ్ శాఖ అలర్ట్.. మద్యం, డ్రగ్స్ సరఫరాపై పటిష్ఠ నిఘా

Liquor Sales Decreased in Telangana : రాష్ట్రంలోని మహబూబాబాద్‌, వరంగల్‌ రూరల్‌, భూపాలపల్లి, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో గుడుంబా తయారీ పెరిగినట్లు అంచనా వేసిన అబ్కారీ శాఖ.. ఆయా ప్రాంతాల్లో నిఘా పెంచడంతో పాటు దాడులు ఉద్ధృతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గుడంబా తయారీ, సరఫరా, విక్రయాలకు సంబంధించి 10 వేలకు పైగా కేసులు నమోదు చేసి 2 వేలకు పైగా వ్యక్తులను అరెస్టు చేసినట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది.

Excise Department Searches in Telangana : 86 వేల లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకోవడంతో పాటు 52 లక్షల 70 వేల లీటర్ల బెల్లం ఊట, 2 లక్షల 38 వేల కిలోల బెల్లం, 264 వాహనాలు సీజ్‌ చేసినట్లు ఎక్సైజ్‌ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నాన్‌ డ్యూటీ పెయిడ్‌ సరఫరా చేస్తున్న వారిపై దాదాపు 500 కేసులు పెట్టి, 94 మందిని అరెస్టు చేసి 8 వేల లీటర్లకు పైగా అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. హరియాణా, గోవాల్లో మద్యం రేట్లు తక్కువకావడంతో.. రోడ్డుమార్గంతో పాటు, రైలు, విమానాల ద్వారా తెస్తున్నట్లు గుర్తించిన అధికారులు రైల్వే స్టేషన్ల వద్ద, ఎయిర్‌ పోర్టు వద్ద బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు చేసేట్లు చర్యలను ముమ్మరం చేశారు.

Telangana Assembly Elections 2023 : అబ్కారీ, పోలీసు శాఖలకు చెందిన ప్రత్యేక బృందాలు తనిఖీల్లో పట్టుబడిన 2 లక్షల 41 వేల లీటర్ల లిక్కర్‌, 51 వేల కిలోలకు పైగా నల్లబెల్లం, 3 వేల 400 కిలోల ఆలుమ్‌, రూ.117 కోట్ల 86 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. అదేవిధంగా రూ.39 లక్షల 48 వేల విలువైన దాదాపు లక్ష కిలోల గంజాయి, 479 గంజాయి మొక్కలు, 30 కిలోల గంజాయి చాక్లెట్లు, మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల కమిషన్ విడుదల చేసిన వివరాల్లో వెల్లడించింది. ఈనెల 28వ తేదీ సాయంత్రం నుంచి మద్యం అమ్మకాలను నిలిపివేయాల్సి ఉండడంతో.. ఎన్నికల సంఘం నిర్దేశించిన సమయంలోపే మద్యం దుకాణాలను మూసి వేయించాలని ఎక్సైజ్‌ కమిషనర్‌ బుద్ద ప్రకాశ్ అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో ఎన్నికల వేళ తగ్గిన మద్యం అమ్మకాలు - అక్రమ లిక్కర్​పై ఎక్సైజ్ శాఖ ఫోకస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.