ఆంధ్రప్రదేశ్‌లో కాపు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ.. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. గతంలో అసెంబ్లీ, మీడియాలో కాపు రిజర్వేషన్లకు మద్దతు తెలిపిన జగన్.. ఇప్పుడు ఎందుకు అమలు చేయట్లేదని నిలదీశారు.
కాపు ఉద్యమానికి మద్దతు తెలిపి.. తమ జాతి సానుభూతి ఓట్లు పొందారని ముద్రగడ దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కాపు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పదవిని మూణ్నాళ్ల ముచ్చట చేసుకోవద్దని హితవు పలికారు.
ఇదీ చూడండి:ఈనాడు, ఈటీవీ భారత్ కథనానికి స్పందన... నగరానికి వచ్చేస్తున్న బామ్మ