ETV Bharat / state

కేంద్ర ప్రభుత్వ వైఖరిపై గీతారెడ్డి ఆగ్రహం! - కేంద్ర ప్రభుత్వంపై గీతారెడ్డి ఆగ్రహం

ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనం చేసేందుకు ప్రయత్నిస్తున్న భాజపా ప్రభుత్వ తీరుపై అందరూ గొంతు విప్పాలని మాజీ మంత్రి, ఆలిండియా ప్రొఫెషనల్​ కాంగ్రెస్​ దక్షిణ భారత ఇంఛార్జి గీతారెడ్డి పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల బాగోగులు పట్టించుకోకుండా.. రాష్ట్రాల్లో భాజపాయేతర ప్రభుత్వాలు కూల్చే పనిలో మోడీ సర్కార్​ ఉందని ఆమె విమర్శించారు.

ex minister Geetha reddy fires on central government
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై.. మాజీమంత్రి గీతారెడ్డి ఆగ్రహం!
author img

By

Published : Jul 26, 2020, 9:28 PM IST

దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనం చేసేందుకు భాజపా చేస్తున్న కుట్రలను ప్రతీ ఒక్కరు వ్యతిరేకించాలని మాజీ మంత్రి, ఆలిండియా ప్రొఫెషనల్​ కాంగ్రెస్​ దక్షిణ భారత ఇంఛార్జి గీతారెడ్డి పిలుపునిచ్చారు. దేశంలో లక్షల మంది ప్రజలు కరోనా బారిన పడి మరణిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం ప్రజారోగ్యం పట్టించుకోకుండా.. అధికార దాహంతో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాల్ని కూల్చే కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చే కుట్రలు ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరచడమే అన్నారు. గవర్నర్లను అడ్డం పెట్టుకుని రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు ప్రజాస్వామ్యవాదులు వ్యతిరేకించాలని కోరారర. అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవడానికి కాంగ్రెస్​ ప్రభుత్వానికి గవర్నర్​ ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆమె ప్రశ్నించారు.

ఇవీ చూడండి: శరవేగంగా వైరస్​ వ్యాప్తి‌.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.