ETV Bharat / state

Etala Resignation: తెరాసతో తెగతెంపులు... నేడు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా

నాది కమ్యూనిస్టు డీఎన్‌ఏ అయినప్పటికీ, ప్రజల ఒత్తిడి మేరకే భాజపాలో చేరుతున్నా. పార్టీ ఏర్పాటు అనేది డబ్బుతో కూడుకున్నది. అందుకే వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇప్పటికే హుజూరాబాద్‌లో తెరాస రూ.50 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలు కేసీఆర్‌ మార్గనిర్దేశంలోనే పనిచేస్తున్నాయి.- ఈటల రాజేందర్

Ex minister Eatala rajemder
తెరాసతో తెగతెంపులు
author img

By

Published : Jun 5, 2021, 5:15 AM IST

Updated : Jun 5, 2021, 12:54 PM IST

తెరాస పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. ఆ పార్టీతో తనకున్న 19 ఏళ్ల అనుబంధాన్ని వదులుకుంటున్నట్లు చెప్పారు. ‘‘నాకు ఎమ్మెల్యే, మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్ష పదవులు బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చినట్లుగా కొందరు నాయకులు అవాకులు, చెవాకులు పేలుతున్నారు. పదవులు ఇవ్వమని నేనెప్పుడూ అడగలేదు. ఏ పదవి ఇచ్చినా సంపూర్ణంగా న్యాయం చేశా. నన్ను ఎమ్మెల్యేగా ఎలా తొలగించాలా అని ఆలోచన చేస్తున్నారని తెలిసింది. మీరు తొలగించేలోగా నేనే వదులుకుంటా’’ అని ప్రకటించారు.

శుక్రవారం హైదరాబాద్‌ శివారు పూడూరులోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున నాయకులు వచ్చి రాజేందర్‌కు మద్దతు తెలిపారు. ఈటలతోపాటు తెరాస నాయకులు తుల ఉమ, ఏనుగు రవీందర్‌రెడ్డి, గండ్ర నళిని, లత, అందె బాబయ్య, బీకే మహేశ్‌, హనుమంతరావు, శ్రీదేవి తదితరులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.

భవిష్యత్తు కార్యాచరణ త్వరలోనే...

మంత్రి పదవి ఇచ్చి కోపమనే నరాన్ని కోసి.. రోషం లేకుండా చేసి బానిసలా బతకమంటే బతకలేనని ఈటల అన్నారు. ‘‘రాష్ట్రంలో రాజుగారి పాలనలో ఒక మంత్రి మీద అనామకుడు ఉత్తరం రాస్తే కనీసం ఏం జరిగిందో తెలుసుకోకుండా మున్సిపల్‌ ఎన్నికలు అయిన అరగంటలోపే విచారణకు ఆదేశించారు. రాత్రికి రాత్రే విచారణ చేసి మంత్రి పదవి నుంచి తప్పించారు. భవిష్యత్తు కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తా. ప్రస్తుతం హరీశ్‌రావు, వినోద్‌, లక్ష్మణరావు తదితరులకు హుజూరాబాద్‌ బాధ్యతలు కట్టబెట్టి డబ్బు ఆశ చూపుతూ నాయకులు, కార్యకర్తలను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఎవరెన్నిచేసినా హుజూరాబాద్‌ ప్రజల మద్దతు నాకే ఉంది. అణచివేత, ప్రలోభాలు, డబ్బు సంచులకు తెలంగాణ సమాజం ఎదురొడ్డి నిలుస్తుంది. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోరు. రానున్న ఉప ఎన్నికలో కుట్రలు, కుతంత్రాలు, డబ్బు సంచులతో తాత్కాలికంగా మీరు గెలవచ్చు. కానీ తెలంగాణ సమాజంలో దానికి ఎప్పటికీ స్థానం ఉండదు’’ అని అన్నారు. ‘ప్రభుత్వం చేసే కుట్రలు ఛేదిస్తాం బిడ్డా.. ధర్మాన్ని, న్యాయాన్ని నిలబెడతాం.. కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాం’ అని హుజూరాబాద్‌ ప్రజలు చెబుతున్నారని అన్నారు.

బీ ఫారం ఇస్తే కేసీఆర్‌ కుమార్తె గెలిచారా?

‘‘నేను గులాబీ సైనికుడిగా ఉన్నా. ఎన్నిసార్లు బీ ఫారం ఇచ్చినా గెలిచా. బీఫారం ఇచ్చినంత మాత్రాన అందరూ గెలవలేరు. కేసీఆర్‌ సొంత కూతురు సైతం నిజామాబాద్‌లో ఓడిపోయారు. డబ్బు, కుట్ర, అణచివేతలనే కేసీఆర్‌ నమ్ముకున్నారు. ఆయన నియంతనని అనుకుంటున్నారు. నల్గొండ, హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు.

ఈటల ప్రెస్​మీట్

ప్రగతిభవన్‌ బానిసల నిలయం...

నాకు, కేసీఆర్‌కు మధ్య దూరం ఐదేళ్ల కిందటే మొదలైంది. అవమానాలు నాకొక్కడికే కాదు. హరీశ్‌రావు కూడా అవమానపడ్డారు. ఒక మంత్రిగా జిల్లా సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు 9 మంది ఎమ్మెల్యేలతో కలిసి వస్తే అపాయింట్‌మెంట్‌ లేదని ప్రగతిభవన్‌ గేటు వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. రెండోసారి ఎంపీ సంతోష్‌తో చెప్పించి అపాయింట్‌మెంట్‌ తీసుకుని వెళ్లాం. అయినా గేటు వద్ద నుంచే బయటకు పంపించారు. మూడోసారీ అలాగే జరిగింది. ప్రగతిభవన్‌ పేరు బానిసల నిలయంగా పెట్టుకోవాలని ఆనాడే సంతోష్‌కు చెప్పా. తెలంగాణ వస్తే కుక్కలు చించిన విస్తరి అవుతుందని సమైక్య పాలకులు అన్న మాటలు గుండెల్లో ఉన్నాయి కాబట్టే ఎన్ని అవమానాలు ఎదురైనా దిగమింగుకుని భరించాం. ఇప్పటివరకూ సీఎంవోలో ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐఏఎస్‌ అధికారి పనిచేశారా?

సంఘాలు, సమ్మెలు ఉండకూడదని...

తెలంగాణ గడ్డ మీద సంఘాలు, సమ్మెలు ఉండకూడదని సీఎం కోరుకుంటున్నారు. ఒకవేళ ఉన్నా తన ఆధీనంలో ఉండాలనుకుంటున్నారు. బొగ్గు గని కార్మిక సంఘాన్ని కల్వకుంట్ల కవిత నడుపుతున్నారు. ఆర్టీసీ, విద్యుత్తు కార్మికుల సంఘాలకు ఆమెను నాయకురాలిగా పెట్టుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. ఆర్టీసీ సంఘం పెట్టిన అశ్వత్థామరెడ్డితో బలవంతంగా రాజీనామా చేయించారు. చివరికి తెలంగాణ ఉద్యమానికి వేదికైన ఇందిరాపార్కు వద్ద ధర్నాచౌక్‌ను ఎత్తివేశారు. సంక్షేమ పథకాలను ఎప్పుడూ వ్యతిరేకించలేదు. వందల కోట్ల ఆదాయ పన్ను కట్టే వారికి రైతుబంధు ఇవ్వొద్దని చెప్పా.

నేనే చివరి వ్యక్తి కాకపోవచ్చు...

ఒక్క మంత్రి, ఒక్క అధికారి స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితి లేదు. సంక్షేమ పథకాల వెలుగులో ఇవన్నీ మరుగునపడేస్తా అంటే కుదరదు. అభివృద్ధి అనేది ఆత్మగౌరవానికి ప్రత్యామ్నాయం కాదు. అప్పట్లో నక్సలైట్ల అజెండా మాది అని చెప్పి, ఇప్పుడు వరవరరావును జైల్లో పెడితే కనీసం కేసీఆర్‌ అడగలేదు. నేను బానిసను కాదు. ఉద్యమ సహచరుడిని. నేను కేటీఆర్‌ కింద కూడా పనిచేస్తానని చెప్పా. తెరాసలో బయట వాళ్లు లోనికి.. లోపలి వాళ్లు బయటకు వెళ్లారు. గతంలోనూ ఆలె నరేంద్ర, విజయశాంతిని ఇలాగే పంపించారు. పార్టీలోంచి వెళ్లిపోయేవారిలో నేను చివరి వ్యక్తి అనుకోవడం లేదు’’ అని ఈటల అన్నారు.

ఆరా తీశాకే భాజపాలోకి వెళ్తున్నా..

వారం రోజుల్లో మంచిరోజు చూసుకుని భాజపాలో చేరేందుకు ఈటల నిర్ణయించుకున్నారు. విలేకరుల సమావేశం తర్వాత మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. భాజపాలో చేరిక విషయాన్ని ధ్రువీకరించారు. తెరాస, భాజపా మధ్య ఉన్న సంబంధాలపై ఆరా తీసిన తర్వాతే ఆ పార్టీలో చేరాలనుకుంటున్నట్లు చెప్పారు. శనివారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పిస్తానని చెప్పారు. అనంతరం హుజూరాబాద్‌ వెళ్లి కార్యకర్తలతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.

ఇదీ చూడండి: Eatala: వారం రోజుల్లో దిల్లీ వెళ్లి భాజపాలో చేరుతా: ఈటల

Last Updated : Jun 5, 2021, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.