ETV Bharat / state

'వచ్చే ఎన్నికల్లో నాకు సీటు లేకపోవచ్చు'.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు - Andhra Pradesh latest news

Balineni Srinivasa Reddy Sensational Comments: ఆంధ్రప్రదేశ్​లో వైసీపీ ఎమ్యెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ రాకపోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం మహిళలకే ప్రాధాన్యత అంటే.. తాను తప్పుకోక తప్పదని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలు పార్టీ గెలుపు కోసం పని చేయాలని పేర్కొన్నారు.

Balineni Srinivasa Reddy
Balineni Srinivasa Reddy
author img

By

Published : Jan 23, 2023, 10:51 PM IST

Balineni Srinivasa Reddy Sensational Comments: వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ రాకపోవచ్చు అంటూ ఆంధ్రప్రదేశ్​లో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌.. 'నీకు సీటు లేదు.. నీ భార్య సచీదేవికి ఇస్తామన్నా' చేసేదేమీ లేదని బాలినేని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళలకు సీఎం ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందన్న బాలినేని.. మహిళలే అంటే తానైనా తప్పుకోక తప్పదని స్పష్టం చేశారు. అదేవిధంగా నియోజకవర్గ నేతలు పార్టీ గెలుపు కోసం కలిసి పనిచేయాలని సూచించారు. సింగరాయకొండ మార్కెట్ యార్డు ఛైర్మన్‌ ప్రమాణస్వీకార సభలో పాల్గొన్న బాలినేని ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.

'వచ్చే ఎన్నికల్లో నాకు సీటు లేకపోవచ్చు'.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.