ETV Bharat / state

Ex Deputy Speaker Harishwar Reddy Passes Away : మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్​ రెడ్డి కన్నుమూత.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు - Ex Deputy Speaker Harishwar Reddy Passes Away

Ex Deputy Speaker Harishwar Reddy Passes Away : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ డిప్యూటీ స్పీకర్​, మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్​ రెడ్డి శుక్రవారం రోజున గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సీఎం కేసీఆర్​ సంతాపం ప్రకటించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కేంద్రమంత్రి కిషన్​రెడ్డి, పలువురు మంత్రులు ఆయన మరణం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు హరీశ్వర్ రెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Koppula Harishwar Reddy Passes Away in parigi
Koppula Harishwar Reddy Passes Away
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 23, 2023, 10:55 AM IST

Updated : Sep 23, 2023, 11:17 AM IST

Ex Deputy Speaker Harishwar Reddy Passes Away : పరిగి నియోజకవర్గం ఎమ్మెల్యే మహేశ్వర్​ రెడ్డికి పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ డిప్యూటీ స్పీకర్​ కొప్పుల హరీశ్వర్​ రెడ్డి శుక్రవారం రాత్రి గుండె పోటుతో హఠాన్మరణం పొందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న హరీశ్వర్​ రెడ్డి.. పరిగిలోని తన నివాసంలో గుండెపోటు(Heart Attack) రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు సీపీఆర్(CPR)​ చేసినా స్పందించకపోవడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనను పరీక్షించిన వైద్యులు చలనం లేకపోవడంతో.. మృతి చెందినట్లు నిర్ధారించారు.

CM KCR Condolence on Koppula Harishwar Reddy Demise : కొప్పుల హరీశ్వర్​ రెడ్డి మరణంతో.. కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం వారి నివాసానికి తీసుకువచ్చారు. ఆయన మృతి పట్ల సీఎం కేసీఆర్​ సంతాపం ప్రకటించారు. పరిగి నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రజాభిమానాన్ని పొందిన సీనియర్​ రాజకీయ నేతగా.. ఆయన చేసిన సేవలను సీఎం కేసీఆర్ కొనియాడారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కేసీఆర్​ గుర్తు చేసుకున్నారు. హరీశ్వర్​ రెడ్డి కుమారుడు, పరిగి ప్రస్తుత ఎమ్మెల్యే మహేశ్​ రెడ్డికి.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

  • బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.

    పరిగి నియోజకవర్గం నించి పలు మార్లు ఎమ్మెల్యే గా గెలిచి, ప్రజాభిమానం పొందిన సీనియర్ రాజకీయ నేతగా, ప్రజలకు ఆయన చేసిన సేవలను సీఎం కొనియాడారు.… pic.twitter.com/LiiJO0aBB4

    — BRS Party (@BRSparty) September 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ కన్నుమూత.. రాహుల్, సోనియా నివాళి

Ex MLA Koppula Harishwar Reddy Passed Away : మరోవైపు మాజీ ఉపసభాపతి హరీశ్వర్​ రెడ్డి మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్​ రెడ్డితో పాటు మంత్రులు కేటీఆర్​, హరీశ్​రావు, ప్రశాంత్​ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. అలాగే ప్రస్తుత శాసనసభ స్పీకర్​ పోచారం శ్రీనివాస్​, మిగిలిన మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి మహేందర్​ రెడ్డి వికారాబాద్ జిల్లా కలెక్టర్​, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.

  • మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొప్పుల హరీశ్వర్ రెడ్డి గారి మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRBRS తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలం పాటు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించిన హరీశ్వర్ రెడ్డి పరిగి ప్రాంతానికి… pic.twitter.com/0DfBuC4qrl

Singer Saichand passed Away : రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సాయిచంద్‌ మృతి

రాజకీయ ప్రస్థానం : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ డిప్యూటీ స్పీకర్​గా పని చేసిన హరీశ్వర్​ రెడ్డి.. తెలుగుదేశం పార్టీలో పోలిట్​ బ్యూరో సభ్యుడిగా పని చేశారు. మొదటిసారిగా 1985 సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మరో నాలుగు దఫాలు ఎమ్మెల్యేగానే గెలుపొందారు. దీంతో ఏకధాటిగా 25 సంవత్సరాల పాటు పరిగి ఎమ్మెల్యేగా పని చేశారు. దీంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో బీఆర్​ఎస్​ పార్టీలో చేరారు. తర్వాత అతని కుమారుడు మహేశ్వర్​ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇప్పుడు తాజాగా మళ్లీ ఆయననే బీఆర్​ఎస్​ అధిష్ఠానం ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించింది.

Gaddar Passed Away : మూగబోయిన ఉద్యమగళం.. ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్ కన్నుమూత..

Gaddar life : వెయ్యి డప్పులు, లక్ష గొంతుల కలయిక..

Last Updated : Sep 23, 2023, 11:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.