ETV Bharat / state

హెచ్చార్సీని ఆశ్రయించిన మాజీ సైనికులు - హెచ్చార్సీని ఆశ్రయించిన మాజీ సైనికులు

తెలంగాణ మాజీ సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. తమకు కేటాయించిన భూమిని మంజూరు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని వారు హెచ్చార్సీని వేడుకున్నారు.

హెచ్చార్సీని ఆశ్రయించిన మాజీ సైనికులు
హెచ్చార్సీని ఆశ్రయించిన మాజీ సైనికులు
author img

By

Published : Sep 3, 2020, 3:35 PM IST

మాజీ సైనికులకు, చనిపోయిన సైనికుల వితంతువులకు వారి పిల్లలకు గతంలో ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని తెలంగాణ మాజీ సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. 2001లో అప్పటి ఉమ్మడి ప్రభుత్వం 614 మంది మాజీ సైనికులకు రంగారెడ్డి జిల్లా జవహర్ నగర్ లో 44 ఎకరాల 12 గుంటల భూమిని కేటాయించినట్లు సంఘం అధ్యక్షుడు రంగయ్య కమిషన్ కు వివరించారు.

భూమిని మాజీ సైనికులకు కేటాయించి 20 ఏళ్లు గడుస్తున్నప్పటికీ తమకు భూమి దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ, తమకు న్యాయం మాత్రం జరగడం లేదని తెలిపారు. దేశ రక్షణ కోసం ప్రాణాలను లెక్కచేయకుండా విధులు నిర్వహించిన తమకు తగిన గుర్తింపు దక్కకపోవడం బాధాకర మన్నారు. సొంత ఇల్లు లేక మాజీ సైనికులమైన తాము దుర్భరమైన జీవితం గడుపుతున్నామని... ఇప్పటికైనా తమకు కేటాయించిన భూమిని మంజూరు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని వారు హెచ్చార్సీని వేడుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.