కేంద్రం ప్రవేశ పెట్టిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై తెలంగాణ కేబినెట్‌లో చర్చ జరిగింది. రూ.8లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ వారికి ఐదేళ్లు సడలింపు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. వానాకాలం పంటల సాగుపై మంత్రివర్గం భేటీలో చర్చ జరిగింది. వర్షాలు, పంటలు, సాగునీరు, ఎరువుల లభ్యతపై చర్చించింది. తెలంగాణలో పత్తికి ఉన్న డిమాండ్ దృష్ట్యా పత్తి సాగు పెంచాలని నిర్ణయించింది. పత్తిసాగు పెంపునకు వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది.
ఇదీ చూడండి: cabinet: కొవిడ్ పరీక్షలు పెంచండి.. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయండి: కేసీఆర్